బెదిరింపులకు లొంగలేదు, ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆయన లెక్కలేంటి? అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు కీలక నేతలను సయితం పక్కనపెట్టారు. వారు పెట్టిన ఒత్తిడికి తలొగ్గలేదు. నేతల బెదిరింపులను సయితం లెక్కచేయలేదు. బెదిరించిన వాళ్లకు కూడా గట్టి హెచ్చరికలే పంపారు. చాలా మంది వెళ్లిపోయారు. అయినా చంద్రబాబు బెదరలేదు. నిజానికి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కొందరైతే చంద్రబాబును పరోక్షంగా బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఒత్తిడులకు ఆయన తలొగ్గలేదు.

madhav 20032019

ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికపై అనూహ్యమైన ఒత్తిడి వచ్చింది. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబారావును.. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని, అవసరమైతే తాను వచ్చి మూడు రోజులు ప్రచారం కూడా చేస్తానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. కానీ కనిగిరి నియోజక వర్గంలో టీడీపీ నిర్వహించిన సర్వేలో బాబూరావు గెలిచే అవకాశం లేదని తేలింది. ఇటీవల పార్టీలో చేరిన ఉగ్రనరసింహరెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారని టీడీపీకి నివేదిక అందింది. ఇదే విషయాన్ని బాలయ్యకు చంద్రబాబు చెప్పారు. బాబూరావును దర్శిలో పోటీ చేయించాలని కోరారు. ఎందుకంటే దర్శిలో బాబూరావు సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ తరఫున తమ బంధువు పోటీ చేస్తున్నారని బాబూరావు చెప్పినప్పటికీ రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న శిద్ధా రాఘవరావు.. తన కుటుంబసభ్యుల్లో ఒకరికి దర్శి టిక్కెట్ ఇవ్వాలని కోరినప్పటికీ చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పారు.

madhav 20032019

ఇక మరో పక్క, చంద్రబాబు అసాధారణ రీతిలో సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో 43 శాతం మందిని మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ స్థాయిలో మార్పులు ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 102 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇద్దరు స్వతంత్రులు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత ఆ పార్టీలో చేరారు. వీరితో కలిపి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 127కి పెరిగింది. ఈ సీట్లలో 34 చోట్ల ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. ఒకట్రెండు చోట్ల ఎమ్మెల్యేలు బలంగా ఉన్నా ఇతరత్రా సమీకరణల కారణంగా మార్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read