పాకిస్థాన్ ప్రధానమంత్రిని నేను విశ్వసిస్తున్నానని, భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని బిజెపి అధ్యక్షుడు శ్రీ అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఆ వ్యాఖ్యలు నేను చేసినట్లుగా ఆధారాలు చూపించాలని సవాల్ చేస్తున్నాను. సైనికుల చావులను టిడిపి, టిఎంసి,కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని అమిత్ షా అనడమే నీచ రాజకీయం. ఒకవైపు మీరు నీచ రాజకీయాలు చేస్తూ ఆ బురద మాకు అంటించాలని చూడటం అతి నీచం. మేము దేశం కోసం మాట్లాడాం..మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి మన గడ్డమీద జరిగింది. ఇంటలిజెన్స్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటన అది. 2013లో బీహార్ లో, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోది చేసిన వ్యాఖ్యలు మీకు దేశద్రోహంగా కనిపించలేదా..? అప్పుడు నరేంద్రమోది చేసిన వ్యాఖ్యలు వీడియో క్లిప్పింగ్ లలో ఉన్నవి మీకు గుర్తు చేస్తాను.

shahletter 23022018 2

‘‘దేశ భద్రత ప్రధాని చేతుల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు హవాలా మార్గంలో డబ్బులు ఎలా అందుతున్నాయి..? ఉగ్రవాదులను నిలువరించే నిగ్రహం ప్రధానికి లేదా..? ఈ గడ్డ అంతా మీ చేతుల్లో, సైన్యం చేతుల్లో ఉంటే ఉగ్రదాడులు ఎలా జరుగుతున్నాయి..? అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా.? మరి మీరెందుకు రాజీనామా చేయరు...? ’’ అని నరేంద్రమోది 5ప్రశ్నలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు వేశారు. ఆ అంశమే నేను గుర్తు చేశాను. ఇప్పుడీ పుల్వామా ఉగ్రదాడికి బాధ్యతగా ప్రధాని పదవికి నరేంద్రమోది రాజీనామా చేస్తారా అని ప్రశ్నించాను. దానికి ఇంత ఉలికిపాటు బిజెపి నేతలకు ఎందుకో అర్ధం కావడం లేదు.నరేంద్రమోది మాట్లాడితే దేశభక్తి ఉన్నట్లు..? నేను మాట్లాడితే దేశభక్తి లేనట్లా..? మీరు చేస్తే గొప్ప రాజకీయం,మేము చేస్తే నీచ రాజకీయమా..?

shahletter 23022018 3

దేశభక్తి గురించి, దేశభద్రత గురించి అమిత్ షా ద్వారా పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. రక్తంలో దేశభక్తి అనిచెప్పేవాళ్లే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణం ద్వారా దేశ ప్రతిష్టను జాతీయంగా, అంతర్జాతీయంగా దెబ్బతీశారు. ప్రతిపక్షాలపై ఈవిధమైన విమర్శల ద్వారా దానిని కప్పిపెట్టాలంటే అది దాగేది కాదు. ఒకవైపు 40మంది జవాన్ల మృతి దేశాన్ని కదిలించివేస్తే, ప్రజల హృదయాలను గాయపరిస్తే, ప్రధాని నరేంద్రమోది ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? తనకేమీ పట్టనట్లు డిస్కవరీ ఛానల్ షూటింగ్ లో 3గంటలు గడిపినట్లు మీడియాలో వచ్చినదానిపై జాతికి ఏం సమాధానం చెబుతారు..? నేనేమిటో, నా స్వభావం ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలుసు. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏనాడూ, ఎవరితో వేలు పెట్టి చూపించుకునే దుస్థితి నాకు రాలేదు. ఇకనైనా బిజెపి నేతలు నాపై చేస్తున్న అర్ధరహితమైన విమర్శలను, దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలి. చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని దేశానికి క్షమాపణలు చెప్పాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్

Advertisements

Advertisements

Latest Articles

Most Read