కర్నూల్ జిల్లా జూపాడుబంగ్లా (మ) తంగడంచ లో జైన్ ఇరిగేషన్ కి కేటాయించిన 636 ఎకరాల్లో సాంకేతిక వ్వ్యవసాయ మరియు ఆహారోత్పత్తుల సముదాయం కి భూమి పూజ చేసి,శిలా ఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
అనంతరం సభ పై స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమేల్యే ఐజయ్య,జైన్ సంస్థ తంగడంచ లో ఏమి చేస్తున్నారో ఇంత వరకు నాకు సమాచారం లేదని, అసలు అభివృద్ధి జరగటంలేదు అన్నట్లుగా, మంచి వాతావరణంలో జరుగుతున్న కార్యక్రమాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భాలో సీఎం చంద్రబాబు కలుగజేసుకొని ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. రాయలసీమను రత్నాలు సీమగా మారుస్తూ, అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్నా దొంగల ముఠా నాయకులు అడ్డుతగులుతున్నారు అని, అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
అంతే కాదు, అక్కడ ఉన్న ప్రజల చేతే, ఎమేల్యే ఐజయ్యకు బుద్ధి చెప్పించారు. ప్రభుత్వం చేస్తుంది మంచా కాదా చెప్పండి అంటూ, ప్రజలని చప్పట్లు కొట్టి చాటి చెప్పమన్నారు. అదే విధంగా, నీళ్ళు తీసుకువస్తున్నామని, నీళ్ళు మీకు కావాలా వద్దా అని, ప్రజలని చప్పట్లు కొట్టి చాటి చెప్పమన్నారు. ఇలాగే పట్టిసీమను అడ్డుకున్నారు అని, పట్టిసీమ లేకపోతే మన రాయలసీమకు నీరు వచ్చేదా అని ప్రశ్నించారు.
ఎమేల్యే ఐజయ్య ప్రతి సారి ఇలాగే చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చి కర్నూల్ లో మీటింగ్ పెట్టినా, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమేల్యే అని మాట్లడిస్తున్న ప్రతి సారి, ఐజయ్య ఇలాగే తలతిక్కగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ సారి, చంద్రబాబు స్టేజి మీదే, ప్రజలందరి ముందు, లెఫ్ట్ అండ్ రైట్ వాయించి, ప్రజల చేతే బుద్ధి చెప్పించారు.