మన ప్రతి పక్ష నాయకుడు, తన ఎంపీల చేత, కేవలం రాజకీయం కోసం, చంద్రబాబుని సాధించటం కోసం, కూలి పని చేసుకునే ఉపాధి హామీ కూలీల నోట్లో మట్టి కొట్టిన సంగతి తెలిసిందే... కొన్ని రోజుల క్రితం, పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై జగన్‌ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు అవినాశ్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాసి ఉపాధి హామీ నిధులు రాకుండా నిలిపివేయించిన సంగతి తెలిసిందే... వీరికి తోడు, కేంద్రం కూడా మనకు రావాల్సిన డబ్బులు లేట్ చేస్తూ, కూలి పనులు చేసుకుని బ్రతికే వారిని కూడా ఇబ్బంది పెడుతుంది.... దీంతో చంద్రబాబు డైరెక్ట్ గా రంగలోకి దిగారు... వైసిపీ ఎంపీలు చేసిన దుర్మార్గాన్ని, చంద్రబాబు ఎలా కవర్ చేస్తున్నారో చూడండి...

cbn 09032018 1 2

ఉపాధి హామీ వేతన దారులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతానికి వేతనాలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది... కేంద్ర ప్రభుత్వం నుండి ఉపాధిహమీ పనులకు వేతనాల రూపంలో రావాల్సిన నిధుల విడుల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తీసుకుంది... సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైయిన పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ పరిస్థితులను సిఎంకు వివరిచారు....

cbn 09032018 1 3

దీనికి స్పందించి పరిస్థితిని ఆర్థం చేసుకున్న సిఎం చంద్రబాబు తక్షణమే ఉపాధిహామీ వేతనదారులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 241.89 కోట్ల రూపాయాలను విడుదల చేయాలని ఆదేశించారు. తక్షణమే ఈ వేతనాలను చెల్లించాలని సిఎం చంద్రబాబు పంచాయితీ రాజ్‌శాఖ అధికారులకు ఆదేశించారు. వెంటనే వేతనాలు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకున్న సిఎంకు మంత్రి లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read