రెండు ప్రైవేట్ ఏజెన్సీలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సర్వే చేయించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి...ఈ సర్వేలో 2014లో కంటే ఎక్కువ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది.. ఒక సంస్థ సర్వే ప్రకారం ఎన్నికలు 2018 డిసెంబర్‌లో జరిగితే... 58శాతం ఓట్లతో టిడిపి 139 సీట్లు సాధిస్తుందని, 24% శాతం ఓట్లతో వైకాపాకు 28 సీట్లు..10శాతం ఓట్లతో..'జనసేన'కు 9 సీట్లు లభిస్తాయని తెలిపింది... రెండో సంస్థ సర్వేలో కూడా, 130 నుంచి 135 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని తేల్చింది.. ఈ సర్వేలలో వెల్లడైన ఇంకో కీలక విషయం ఏమిటంటే రాయలసీమ జిల్లాల్లో కూడా వైసీపీ కన్నా టీడీపీ నే ఎక్కువ సీట్లు గెలుస్తుందట. కిందటి ఎన్నికల్లో 52 స్థానాలకు గాను 23 చోట్ల మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఈసారి ఆ సంఖ్య 30 నుంచి 38 మధ్య వుండే అవకాశం ఉందట.

cbn survey 28012018 2

ఇందులో వెల్లడైన ఫలితాలు చూసి సీఎం చంద్రబాబు ఖుషీగా ఉన్నారు... ఇదే విషయం ముఖ్యమన నేతలతో పంచుకున్నారు.. కాని ఏ మాత్రం అశ్రద్ధ ఉండకూడదు అని, ఇలాగే పోజిటివ్ మూడ్ కంటిన్యూ చెయ్యమని చెప్పారంట.. అయితే, ఈ రెండు సర్వేల్లో వెల్లడైన ఒక విషయం పై మాత్రం, చంద్రబాబు నిరుత్సాహంగా ఉన్నారు.. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో, నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి కొంత బలహీనంగానే ఉందని సర్వేలో తేలింది... మిగిలిన జిల్లాలతో పోల్చినప్పుడు ఈ రెండు జిల్లాల్లో టీడీపీ అనుకూలత బాగా పెరగకపోవడానికి కారణం ఏమిటనే ఆలోచన చంద్రబాబుని కలవరపెడుతోంది...

cbn survey 28012018 3

అలాగే సర్వేలో, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాల పై, ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్టు వచ్చింది... ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, రేషన్ సరుకుల పంపిణీ పై ప్రజలు సంతృప్తితో ఉన్నారని సర్వేలో తెలిసింది. కాని, కొన్ని ప్రాంతాల్లో యువత నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయిందని అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది... ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సానుకూలంగానే ఉన్నారని, కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకంగా ఉందని టీడీపీ చేయించిన సర్వేలో తెలిసింది... ఈ అన్ని విషయాల పై చంద్రబాబు విశ్లేషిస్తున్నారు.. వీలైనంత త్వరగా, ప్రజల్లో వెల్లడైన అసంతృప్తి కలిగించే విషయాల పై ఆక్షన్ ప్లాన్ తయారు చేసి, ఎన్నికల లోపు ఆ అసంతృప్తి పోగొట్టాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు... మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ఒక్క చెడ్డ పని చేసినా, మన మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, సాధ్యమైనంత వరకు, పోజిటివ్ మూడ్ ని కంటిన్యూ చెయ్యమని, నాయకులకి చంద్రబాబు చెప్తున్నారు....

Advertisements

Advertisements

Latest Articles

Most Read