ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోడీ నిన్న అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో చెప్పిన అబద్ధాలని, ప్రతి విషయం ఆధారాలతో సహా నేషనల్ మీడియాకు చెప్తూ, మోడీని చాకిరేవు పెడుతున్నారు... ఇప్పటి వరకు, దేశంలో ఎవరూ చేయిని విధంగా, రెండో సా,రి ఇలా మోడీని దేశ రాజధానిలోనే తూర్పారబడుతున్నారు... ఎన్నికల సమయంలో ఏపీకి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు, అమరావతి వచ్చి ఢిల్లీకి మించిన రాజధాని కడతాను అనటం, ఇచ్చిన డబ్బులు వెనక్కు తీసుకోవటం ఇలా అన్ని విషయాలు సెహ్ప్పారు...
అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, అమరావతిలో అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామని మోదీ చెప్పారని అన్నారు... ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని చెప్పి, ఆ తరువాత హోదాకు బదులు, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబితే అంగీకరించామని చంద్రబాబు అన్నారు.. అయితే, అది కూడా మూడేళ్ళు అయినా పైసా ఇవ్వలేదు అని చెప్పారు... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటోందని విమర్శించారు... అలాగే హోదా లేదు అంటూనే, మిగతా రాష్ట్రాలకు ఇచ్చారని చెప్పారు.. అందుకే, ఇవన్నీ మాకు వద్దు, మా హోదా మాకు ఇవ్వండి అని అడుగుతున్నామని చెప్పారు...కేంద్ర ప్రభుత్వ తీరువల్ల 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు..
అలాగే, బిల్ లో పెట్టిన 19 అంశాలు ఒక్కొక్కటి వివరించారు... పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధాని చేసిన ఆరు హామీలు కూడా వివరించారు... అవి ఏంటి, కేంద్రం ఇప్పటి వరకు ఏమి ఇచ్చింది, ప్రస్తుత స్థితి ఏంటి అనేది వివరించారు.. అలాగే నిన్న ప్రధాని చేసిన చౌకబారు ప్రసంగం పై కూడా చంద్రబాబు స్పందించారు. "నన్ను , వైఎస్ జగన్ తో పోలుస్తూ, కెసిఆర్ నాకంటే ఉత్తముడు అంటూ, ప్రధాని అంటున్నారు. వైఎస్ జగన్ ఒక దొంగ. నిన్న కూడా కోర్ట్ లో ఉన్నాడు. ఇలాంటి దొంగని, నాతో పోలుస్తూ, పార్లమెంట్ లో చెప్తారు. మేము అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి. ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి, ఇంత చిల్లరగా మాట్లాడటం చూడలేదు. 5 కోట్లు మంది అడుగుతుంటే, ఇలాంటి సమాధానమా చెప్పేది" అంటూ మోడీ పై విరుచుకుపడ్డారు.