ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి మన రాష్ట్రం కోసం ఎంత శ్రమిస్తున్నారో, దానికి రివర్స్ లో చాలా మంది తెలుగుదేశం నాయకులు ఉదాసీనంగా ఉంటున్నారు... కొద్ది మంది నాయకులు తప్పితే, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళే వారు లేరు... చంద్రబాబు ఎంత చెప్పినా ఈ నాయకులు మారటం లేదు... ఎంత పెద్ద విషయం జరిగినా, చివరకి ముఖ్యమంత్రి స్పందించాల్సిందే కాని, తెలుగుదేశం నాయకులు మాత్రం స్పందించరు... అందుకే చంద్రబాబు వీరి పులుసు వంచటానికి ఎప్పుడూ ప్రజల్లోని ఉండేలా కొన్ని రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు... తెలుగుదేశం నాయకులని ఊపిరి ఆడనియ్యకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారిని ప్రజల్లోనే ఉంచుతున్నారు...
నేను రాష్ట్ర అభివృద్ధి చూసుకుంటా, మీరు ప్రజల సమస్యలు చూడండి అనే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి... రాజకీయంగా దీని ఫలితాలు కూడా ఆయనకు కనిపిస్తున్నాయి... పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగినట్లు టీడీపీ అంతర్గత సర్వేలు సూచిస్తున్నాయి... నవంబర్ నెలకు ముందు, జన చైతన్య యాత్రలు పెట్టారు... నవంబరు నుంచి డిసెంబరు నెలాఖరు వరకూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఊరకే మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్ణయించడం.. నిర్వహించడం కాకుండా ప్రతి రోజు, ప్రతి ఎమ్మల్యేని ఫాలోఅప్ అయ్యేవారు చంద్రబాబు. మొత్తం ఆరు రకాల నిబంధనలు పెట్టి వాటి ఆధారంగా నియోజకవర్గాలకు గ్రేడింగ్ ఇచ్చారు. ఈ గ్రేడింగ్‌ను పార్టీ అంతర్గత సమావేశాల్లో చదివి వినిపించారు. దీనితో వెనుకబడి ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జుల్లో వేడి పుట్టి ఎవరికి వారు గ్రేడింగ్ పెంచుకోవడానికి విస్తృత పర్యటనలు చేశారు
దీని కొనసాగింపుగా మంగళవారం నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు జన్మభూమి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాయకులతో పాటు, అధికార బృందాలు ప్రతి గ్రామాన్ని, ప్రతి నివాస ప్రాంతాన్ని సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రజా ప్రతినిధులు కూడా తప్పనిసరిగా ఈ పది రోజులూ ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రజల్లోకి పదే పదే ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు వెళ్లడం వల్ల వారి సమస్యలు తెలుస్తాయని, అవి తెలిస్తే పరిష్కరించే దిశగా వ్యూహం రూపొందించుకోవచ్చునని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు. ఒకసారి వెళ్లి సమస్యలు విని రావడం కాకుండా పదే పదే వెళ్లాల్సి రావడంతో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెడుతున్నారు.