చైతన్య రథసారిథి నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది... మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వైపు అంతిమయాత్ర సాగుతోంది... హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు... నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడేను తన భుజంమై మోసి... అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలో ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు... అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, జస్టిస్ చలమేశ్వర్ తదితరులుండగా... అంతిమ యాత్రను నందమూరి కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు అనుసరిస్తున్నారు. అంతిమయాత్రకు భారీ సంఖ్యలు టీడీపీ శ్రేణుల, హరికృష్ణ అభిమానులు తరలిరావడంతో మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం రోడు జనసంద్రమైంది. మరోవైపు మహాప్రస్థానానికి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు.
మరో వైపు అంతిమయాత్ర మార్గంలో వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెహదీపట్నం, నానాల్ నగర్ X రోడ్, టోలిచౌక్, విస్పర్ వ్యాలీ టీ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకూ అంతిమ యాత్ర కొనసాగనుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్ విభాగం సూచించింది. జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.