రచయిత్రి, సంఘ సేవామయి, మాన వతా స్ఫూర్తి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌, టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలు సుధామూర్తి పెద్ద మనసుతో స్పందిం చారు. వంద మంది విద్యార్ధులున్న ప్రతి పాఠశాలలకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ పక్షాన పుస్తకాలను విరాళంగా అందజయనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా ల్లోని 3000 పాఠశాలలకు పుస్తకాలను విరాళంగా అందజేయాలని నిర్ణయించారు. జీవితం కోణాలను స్పశిస్తూ , విలువలతో కూడిన మెరుగైన జీవనానికి బాటవేసే దిశగా అవగాహన కలిగించే పుస్తకాలివి. వీటిలో 250 టైటిళ్లతో కూడిన పుస్తకాలను మాధ్యమిక పాఠశాలలకు ఇవ్వనున్నారు. ఉన్నత పాఠశాలలకు ఎంపిక చేసిన 300 టైటిళ్ల పుస్తకాలు పంపనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని వందకు మించిన విద్యార్ధులున్న 1725 ప్రాధమిక పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు రూ.10,000 వంతున, 842 ఉన్నత పాఠశాల్లో ఒక్కో పాఠశాలకు రూ.15,000 వంతున మొత్తం రూ. 2.5 కోట్ల విలువైన పుస్తకాలను విరాళంగా అందించనున్నారు.

infosis 02082018 2

గ్రంధాలయాలకు ఇంత భారీ స్ధాయిలో గతంలో ఏ స్వచ్చంద సంస్ధ కూడా పుస్తకాలు విరాళంగా అందజేయలేదు. సుధా మూర్తి గత ఏడాది విజయవాడ సందర్శించినప్పుడు నగర పాలక సంస్ధ పరిధి లోని ఎంపిక చేసిన పాఠశాలలకు పుస్తకాలు విరాళంగా ఇవ్వాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాశాఖను సంప్రదించిన మీదట తొలుత విజయవాడ నగర పాలక సంస్ధ పరిధిలోని 54 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఉన్నత పాఠశాలలకు రూ. 15,000, ప్రాధమిక పాఠశాల లకు రూ. 10,000 విలువైన పుస్తకాలను బహుకరించారు. అలాగే గత మార్చిలో అమరావతి వచ్చినప్పుడు సుధామూర్తి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 45 ప్రభు త్వ , జిల్లా పరిషత్‌ పాఠశాలలకు పుస్తకాలు విరాళంగా ఇచ్చారు. వీట న్నింటి విలువ రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె భారత సైనికులు, సమాజంలో అట్టడుగు వర్గాల శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతున్నారు.ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత,పుస్తక ప్రేమికురాలు, సాహితీ పిపాసి, కనీసం ఒక్క గ్రంధాలయమైనా నెలకొల్పాలన్న తన తాతగారి ఆకాంక్ష మేరకు,ఆయన కలను నెరవేరుస్తానని వాగ్ధానం చేశారు.ఒక ఉద్యమంలా చేపట్టి ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 60 వేల గ్రంధాలయాల అభివృద్దికి సహకారం అందిస్తున్నారు.

infosis 02082018 3

పాఠశాలలకు పుస్తకాలను విరాళంగా అందజేస్తున్న సుధామూర్తిని ముఖ్య మంత్రి అభినందించి,ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న తమ ప్రయత్నానికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సహకారం మరవలేని దన్నారు. విరాళంగా అందజేస్తున్న పుస్తకాలు విద్యార్ధులకు ఉపయోగపడేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి విద్యాశాఖను కోరారు.ఎంతో ఔన్నత్యం కలి గిన సుధామూర్తి రచయిత్రిగా కలం ద్వారా స్పందిస్తూ మరో వైపు ఫౌండేషన్‌ ద్వారా సామాజిక సేవ చేస్తూ ఆచరణాత్మక దృక్పధంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. సుధామూర్తి స్పూర్తితో మరికొందరు ఆ దిశగా స్పందించే అవకాశం ఉందన్నారు. తన సదాశయం, ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి సుధామూర్తి ఏపీను గమ్యస్ధానంగా ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read