మొన్నటి వరకు బహిరంగ వేదికల పై, మీడియా ముఖంగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ చేసిన అన్యాయాన్ని నిలదీసిన చంద్రబాబు, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాక్షిగా, నిలదీయటానికి రెడీ అవ్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్రం చేసిన అన్యాయంపై నీ తి ఆయోగ్ సమావేశంలో నిలదీయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రానికి వివిధ కేంద్ర పథకాల కింద వచ్చిన నిధులు.. వాటిలో జరిగిన అన్యాయం.. వ్యవసాయం, విద్య, వైద్య తదితర రం గాల్లో కేంద్రం చేసిన సాయం తదితర వివ రాలన్నీ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాని మోదీ, అ న్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ఈ నెల 16న ఢిల్లీలో జరగనుంది. అయితే అదే రోజు రంజాన్ కావటంతో, తేదీ మార్చమని ఇప్పటికే చంద్రబాబు కోరినా, కేంద్రం నుంచి స్పందన లేదు.
ఈ సమావేశంలో రాష్ట్రం తరపున ఏయే అంశాలు లేవనెత్తాలన్న దానిపై చంద్రబాబు బుధవారమిక్కడ సచివాలయంలో ఉన్నతాధికారులు, కొందరు శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రం నుంచి వైదొలగిన అనంతరం ప్రధాని మోదీకి చంద్రబాబు ఎదురుపడనున్న సమావేశం ఇదే. నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధ సంస్థ అని, కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీకి దాన్ని ఏర్పాటు చేశారని, దానిపై కేంద్రం పెత్తనం తగదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేస్తారని సమాచారం. రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని నీతి ఆయోగ్ స్వతంత్రంగా పంపిణీ చేయాలని, కానీ కేంద్రమే నిబంధనలు విధించి దానిప్రకారమే చేయాలని చెప్పడాన్ని ఆయన తప్పుబడతారు.
1971 జనాభా లెక్కలను కాకుండా, తాజా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు న ష్టం జరుగుతుందని స్పష్టం చేస్తారు. జనాభా ని యంత్రణను సమర్థంగా అమలుచేసి, బాగా పని చేసిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని గట్టిగా చెబుతారు. విభజన అంశాలు, కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక అందించాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, అందువల్ల సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నీతి ఆయోగ్ గత సమావేశపు కార్యప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో తనకు సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఏమేరకు వినియోగించాం, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాలి? అనే వివరాలను, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు జరుగుతున్న కేంద్రపథకాల తాజా స్థితిని చంద్రబాబు సమీక్షించారు.