నిన్నటి అవిశ్వాసం పై పోరాటం కొనసాగింపుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కూడా ఒత్తిడి కొనసాగించనున్నారు. ఢిల్లీ వెళ్లి మళ్ళీ హీట్ కొనసాగించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటలో భాగంగా లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతి తెలిపిన పార్టీలకు సీఎం కృతజ్ఞతలు చెప్పనున్నారు. లోక్‌సభలో అవిశ్వాసం, ప్రధాని చెప్పిన అబద్ధాలు, తదనంతర పరిణామాల పై సీఎం చంద్రబాబు ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడతారు. మరో పక్క, నిన్న రాత్రి 11:20 వరకు పార్లమెంట్ లో చర్చ జరిగింది. 11:30 కల్లా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు గంట సమయం మాట్లడారు. జగన్ ఉదయం మాట్లడతాను అని చెప్పి, పవన్ ట్వీట్ లు వేస్తుంటే, చంద్రబాబు మాత్రం అర్ధరాత్రి అయినా ప్రధాని చెప్పిన అబద్ధాలను ఖండించారు.

cbn delhi 21072018 2

‘‘విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనకు అన్ని ప్రయత్నాలూ చేస్తూనే... చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం చెప్పాల్సిందిపోయి, ప్రధాని మాట్లాడిన తీరు చాలా బాధ కలిగించింది. నేనేదో యూటర్న్‌ తీసుకున్నానన్నట్టుగా మాట్లాడుతూ, రాజకీయ ఎదురుదాడికి దిగారు. ప్రధానిని గద్దె దించడానికి సంఖ్యా బలం లేకపోయినా, అహంకారంతో అవిశ్వాసం పెట్టామన్నట్టు మాట్లాడారు. ప్రధానే పెద్ద అహంకారి. అధికారం ఉంది, తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారం ఆయనది’’ అని మండిపడ్డారు. తనకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య గొడవులున్నాయన్నట్టుగా ప్రధాని మాట్లాడటం సరికాదన్నారు.

cbn delhi 21072018 3

‘‘కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని చెబుతున్న మీరు ఎక్కడ న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? ఐదు కోట్ల ఆంధ్రులంటే అంటే అంత చులకనా? 25 మందే ఎంపీలున్నారు, మీరు ఓటేయకపోతే నాకేంటన్న ధీమానా? అహంభావమా? పైగా మేం తెలంగాణ ఆస్తులపై గురిపెట్టామన్నట్టు మాట్లాడతారా? 60 సంవత్సరాలు కష్టపడి, కట్టుబట్టలతో నెత్తిన అప్పుపెట్టుకుని వచ్చినప్పుడు కోపం, బాధ ఉంటాయి కదా? 60 సంవత్సరాల కష్టార్జితం వదులుకుని వచ్చినప్పుడు, పెద్ద తరహాలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఆ రోజు మీరు కూడా సహకరించబట్టే రాష్ట్ర విభజన జరిగింది. మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ దేశంలో మేం భాగం కాదా? మేం సుహృద్భావ వాతావరణంలో సమస్యల సాధన కోసం ప్రయత్నిస్తుంటే... కేంద్రం లెక్కలేని ధోరణిలో, మనల్ని అణచివేయాలని చూస్తోంది’’ అని సీఎం మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read