పెన్ డ్రైవ్ లు అంటే, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం కాదు... మన రాష్ట్రానికి సంబంధించిన పెన్ డ్రైవ్... మొన్న అఖిల పక్ష సమావేశంలో కూడా, ఇలాగే డేటా అంతా పెన్ డ్రైవ్ లలో పెట్టి, అందరికీ ఇచ్చారు... ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కూడా, ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివిధ పార్టీలకు వివరించడానికి అవసరమైన ప్రజెంటేషన్లు, పుస్తకాలను సమగ్ర వివరాలతో తయారు చేయించారు. కొందరు నిపుణులతో సమావేశమై.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఎంపీలకు అందజేయడానికి ఒక పుస్తకం కూడా సిద్ధం చేయించారు.
విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో పెట్టిన హామీలు, అవి కాక పార్లమెంట్ వేదికగా ఇచ్చిన వాగ్దానాలు... అవి అమలైన తీరు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు... ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అందుబాటులో ఉన్న నాయకులందర్నీ కలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అక్కడ ఎవరెవర్నీ కలవాలి? సీఎంతో పాటు వెళ్లే ప్రతినిధి బృందంలో అఖిలపక్షాలు, సంఘాల నాయకులు ఎవరెవరు ఉంటారనే దానిపైన ఈ రోజు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది...
టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు, ఆయా పార్టీల ఎంపీలను కలిసి వారికి కృతజ్ఞతలు చెబుతూ మరిన్ని వివరాలు ఇవ్వాలన్నది సీఎం యోచన. విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో పూర్తిస్ధాయి కదలిక వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీకీ వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించకుండా.. ఇప్పటికైతే కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి ఏకమవుతున్నాయి.