వైసీపీ అరాచకాలను ఎదుర్కునేందుకు, చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఉదయం అమరావతి నుంచి బయలుదేరి, కుప్పం వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, తిరుపతి కానీ, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు కానీ చేరుకొని, అక్కడ నుంచి బై రోడ్ కుప్పం వెళ్లనున్నారు. తిరుపతి ఎయిర్ పోర్ట్ కు కానీ, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు కానీ, ఎక్కడ నుంచి అయినా చంద్రబాబు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా ఈ రోజు పోలింగ్ సమయానికి, కుప్పంలో ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. తానే స్వయంగా ఎన్నికలు పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ రోజు కుప్పం మునిసిపాలటీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడ అరాచకాలు సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా కుప్పంలో పరిస్థితి పై సమీక్షలు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఓటర్లను ప్రభావితం చేయటం ఒక ఎత్తు అయితే, అక్కడ ఓటర్లు ఎంత ప్రలోభాలకు గురి చేసినా, చంద్రబాబుకి తప్ప ఎవరికీ ఓటు వేయరని, అందుకే అక్కడ ఓటర్లను కాకుండా, దొంగ ఓట్లను వైసిపీ నమ్ముకుంది. దీని పైన టిడిపి కూడా ఫోకస్ పెట్టింది.

cbn 15112021 1

తిరుపతి ఫార్ములానే ఇక్కడ కు ఉపయోగించనున్నారు. దొంగ ఓటర్లు తరలిస్తున్న బస్సులు, కార్ల వివరాలు, వారిని ఎక్కడకు తరలించారు, ఏమి చేస్తున్నారు అనే వివరాలు, ఇలా అన్ని వివరాలు ఎప్పటికప్పుడు టిడిపి నేతలు, అటు ఎన్నికల కమిషన్ కు, ఇటు పోలీసులకు కూడా తెలియ పరుచుతున్నారు. అలాగే స్థానిక టిడిపి నేతలను చంద్రబాబు ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లను దించటానికి ఈ సారి ఫంక్షన్ అంటూ ప్లాన్ వేసారు. తిరుపతిలో స్వామి వారి దర్శనానికి వచ్చాం అని చెప్పినట్టు, ఇక్కడ ఫంక్షన్ అని చెప్తున్నారు. బయట ప్రాంతాల ఓటర్లు పెద్ద ఎత్తున కుప్పం రావటంతో, ఈ దొంగ ఓట్లను అడ్డుకోవటానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కావటంతో, ఆయనను పోలీసులు ఆపే అవకాసం ఉండదు. అయితే ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా, పోలీసులు మాత్రం, ఎక్కడా అడ్డ్రెస్ లేరని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రలోభాలకు కుప్పం ప్రజలు లొంగరని, ఇలా దొంగ ఓట్లు చేస్తున్నారన టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read