జూన్ 16న, ప్రధాని మోడీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుస్తారా ? చంద్రబాబు వెళ్తారో లేదో కాని, మోడీ మాత్రం అందరి ముఖ్యమంత్రులను జూన్ 16న, కలుద్దాం రండి అంటున్నారు. ఆర్థిక అంశాల పై వివిధ రాష్ట్రాల నుంచి తలెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో వచ్చే నెల 16వ తేదీన ఢిల్లీలో నీతి అయోగ్ కీలక సమావేశం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశ అజెండా అంశాలను కూడా రాష్ట్రాలకు పంపించారు. ఈ ఆహ్వానంలో ప్రధానంగా సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా స్పందించడం విశేషం. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు. 2022 సంవత్సరం వరకు అభివృద్ధి అనే అంశం పై కొన్ని రంగాల పై చర్చించనున్నారు.

modi cbn 29052018 2

మూడో విడత నీతి ఆయోగ్ సమావేశాల్లో చర్చించిన అంశాల పై తీసుకున్న చర్యలపై ముందుగా ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం వ్యవసాయ రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చిస్తారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడం పైనా చర్చ ఉంటుంది. ఇ-నామ్, భూసార ఆరోగ్య పరీక్షలు, గ్రామీణ వ్యవసాయ పరిస్థితి, జాతీయ ఉపాధి హామీ పథకం, జల సంరక్షణపై ఉపాధి హామీ ప్రభావం పైనా చర్చిస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వాస్య సురక్ష మిషన్ గురించి అజెండాలో పొందుపరిచారు. కీలక అవసరాలున్న జిల్లాలకు అందించాల్సిన ప్రత్యేక సాయం, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్ర ధనుష్ సహా మహాత్మాగాంధీ 150 జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల సలహాలు తీసుకోనున్నారు.

modi cbn 29052018 3

కేంద్ర రాష్ట్రాల మధ్య ఇటీవల సన్నగిల్లుతున్న సత్సం బంధాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇటీవల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తర, తూర్పు రాష్ట్రాలు కేంద్రం పై విరుచుకుపడుతున్నాయి. సహకార సమాఖ్య విధానానికి కేంద్రం తూట్లు పొడుస్తోందన్న ఆందోళన ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. కేవలం కొన్ని రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్న కేంద్రం మిగిలిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదనే అసంతృప్తిని రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితి పై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు సహకార సమాఖ్య విధానం పైనే ఎక్కువగా స్పందించడం, దీని పైనే కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో బీజెపికి ఎదురుదెబ్బ తగలడం, ఇతర రాష్ట్రాల్లో కూడా అసంతృప్తి పెరుగుతుండడంతో కేంద్రం దిగి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగో నీతి అయోగ్ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రం సహకార సమాఖ్య విధానానికి కట్టుబడి ఉంటుందని రాష్ట్రాలకు రాసిన ఆహ్వాన లేఖలో పేర్కొనడం విశేషం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read