కేంద్రం పై దశలవారి పోరాటానికి, తెలుగుదేశం పార్టీ సిద్దమైంది... ముందుగా పార్లమెంట్‌లో బీజేపీని ఎండగట్టాలని, నాలుగు రోజుల పాటు జరిగే బడ్జెట్ సమావేశాల్లో, ఒత్తిడి తేవాలని, బడ్జెట్ ఆమోదం పొందే లోపు, మన సమస్యలు బడ్జెట్ లో అడ్రస్ చేసే విధంగా ఒత్తిడి తెద్దాం అని చంద్రబాబు ఎంపీలతో అన్నారు... నాలుగు రోజుల పాటు జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం పై యద్ధం లాంటిదే చెయ్యాలని ఎవరు ఏం చెప్పినా తగ్గొద్దని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు... మనం తీసుకునే నిర్ణయం, రాజకీయ నిర్ణయం అయితే, ఈ పాటికి బయటకు వచ్చి, ప్రజలు మనసులు గెలుచుకోవచ్చు, కాని, మనకి రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం, మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో, ఆవేశంలో ఏ మాత్రం తప్పతడకు వేసినా, రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు...
కేంద్ర బడ్జెట్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మనం మౌనంగా ఉంటే కుదరదని ఎంపీలకు ఆయన హెచ్చరించారు. పార్టీలకతీతంగా కేంద్ర బడ్జెట్‌ను అందరూ వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు మిత్రపక్షంగా, మిత్ర ధర్మం పాటిస్తూ మన వినతులు ఇచ్చాం... ఇప్పుడు మిత్రపక్షంగా ఉంటేనే, మనకు జరిగిన అన్యాయం వినిపిద్దాం, ఇది మొదటి అడుగు మాత్రమేనని, ఏపీ ప్రయోజనాలను సాధించుకునే వరకు పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రేపటి నుంచే నిరసనలు, ఆందోళనలు చేపట్టండి చంద్రబాబు పిలుపునిచ్చారు...
దీని పై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘నన్ను ఆవేశపరుడన్నారు. అందరూ నా అభిప్రాయంతో ఏకీభవించారు. నిరసనలు, ఆందోళనలకు దిగిరాకపోతే చివరి అస్త్రం రాజీనామా. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు నిర్ణయం. మా ఎంపీలందరూ నా అభిప్రాయంతో ఏకీభవించారు’’ అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. పోరాటాలకు కేంద్రం దిగిరావాల్సిందేనని, దిగిరాకపోతే మాత్రం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఎంపీ టీజీ వెంకటేష్ హెచ్చరించారు... ఆత్మగౌరవ నినాదం తమకు గుర్తుందని, ఊరుకోమని, తాడో పేడో తేల్చుకునే దిశగా చర్చలు జరిగాయని టీజీ వెంకటేష్ చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం తప్పదని, కొనసాగుతూనే ఉంటుందని, వెనక్కి తగ్గేది లేదని ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు. తాడే పేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పార్లమెంట్‌లో ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేస్తామని క్రిష్టప్ప హెచ్చరించారు.