అమరావతిలో ఒక పక్క మండలి రాద్దు అంశం పై, అసెంబ్లీలో చర్చ జరిగి, ఏమి జరుగుతుందో అని ఆసక్తి ఉన్న వేళ, విజయవాడలో కర్ణాటక రైతులని అరెస్ట్ చెయ్యటం సంచలనంగా మారింది. అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం 40వ రోజుకు చేరుకుంది. అయినా ఎక్కడా ప్రభుత్వం కనీసం వీరిని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కనీసం వారి సమస్య ఏమిటి అనేది కూడా పట్టించుకోలేదు. అయినా అమరావతి రైతులు, శాంతియుతంగా, ఎక్కడా లైన్ దాటకుండా, వారు 40 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, అమరావతి రైతులకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అయితే, ఈ రోజు అమరావతి రైతులకు అనూహ్య మద్దతు వచ్చింది. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న నిరసనకు, కర్నాటక నుంచి వచ్చిన రైతులు, మద్దతు ప్రకటించారు. అయితే, ఇది ఇక్కడితో అయిపోలేదు. వారు అమరావతికి వస్తూ ఉండగా, వారిని పోలీసులు అడ్డుకోవటం, సంచలనంగా మారింది. మడ్డు ఇస్తే కూడా అడ్డుకుని, అరెస్ట్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు.

cbn 277012020 2

అది కూడా, వేరే రాష్ట్ర రైతులని, మన రాష్ట్రంలో అరెస్ట్ చెయ్యటం, సంచలనంగా మారింది. అయితే కర్ణాటక రైతుల అరెస్ట్ ను తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు కర్ణాటక రైతులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్ళు ఏమి తప్పు చేసారని అరెస్ట్ చేసారని, చంద్రబాబు అడిగారు. వారిని వెంటనే విడుదల చేసి, వారిని అమరావతి రైతుల దగ్గరకు వెళ్ళకుండా చెయ్యాలని కోరారు. వారిని కనుక విడుదల చెయ్యకపోతే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను అంటూ చంద్రబాబు హెచ్చరించారు. దీంతో, పోలీసులు మళ్ళీ చంద్రబాబు వస్తే, ఎలా ఉంటుందో అని, పోలీసులు వెంటనే వారిని విడుదల చేసారు. వారికి అండగా అక్కడ స్థానికి విజయవాడ టిడిపి నేతలు ఉన్నారు.

cbn 277012020 3

చంద్రబాబు మాట్లాడుతూ, "కర్ణాటక నుంచి వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం హేయం. రాజధాని రైతులకు మద్దతుగా కర్ణాటక రైతులు వస్తే తప్పా..? సాటి రైతులు కష్టంలో ఉన్నారని కర్ణాటక రైతులు వచ్చారు. తోటి రైతులకు సంఘీభావం చెప్పడమే వాళ్ల నేరమా..? ఒక రైతుకు, మరో రైతు మద్దతివ్వడంలో తప్పేంటి..? తక్షణమే కర్ణాటక రైతులను వదిలేయాలి. లేకుంటే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఏవిధంగా విడుదల చేయరో చూస్తాను " అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే కర్ణాటక రైతులు, వారికి ఎదురైన పరిస్థితి చూసి అవాక్కయ్యారు. మేము ఏమి చేసాం అని మమ్మల్ని అరెస్ట్ చేసారు, ఒక సాటి రైతుకు, మరో రైతు, ఈ దేశంలో మద్దతు తెలపటం కూడా తప్పా అంటూ, కర్ణాటక రైతులు వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read