ఇటీవల కాలంలో, ఆంధ్రప్రదేశ్ రాజాకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వంగవీటి రాధా పై రెక్కీకి సంబంధించి, ఆయన్ను పరామర్శించేందుకు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కొద్ది సేపటి క్రితం, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. విజయవాడ క్లబ్ కు సమీపంలో ఉన్న ఫాం హౌస్ లో ఉంటున్న రాధాను, ఆయన తల్లి రత్న కుమారి, వీరి ఇరువురినీ కూడా ఆయన పరామర్శించారు. రెక్కీకి సంబంధించిన వివరాలు ఏమిటి, అసలు ఎలా అనుమానం వచ్చింది, సిసి టీవీ ఫూటేజ్ లో ఉన్న కార్ల వివరాలు ఏంటి, ఎలా గుర్తించగలిగారు అనే అంశం గురించి, పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది, గన్ మెన్ల అంశం పై కూడా, వీటి అన్నిటి పైన కూడా, చంద్రబాబు ఆరా తీసారు. అనంతరం చంద్రబాబు బయటకు వచ్చి, మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రాధా పై రెక్కీకి సంబంధించి, దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, అయితే ఈ దర్యాప్తు పూర్తి పారదర్శకంగా ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. రాధా రెక్కీకి సంబంధించి దర్యాప్తు వివరాలు, రాధా ఇచ్చిన సమాచారం తీసుకుని, ప్రభుత్వం తన వద్ద ఉన్న ఆధారాలు బయట పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అసలు ఈ రెక్కీ ఎవరు చేసారు, ఎందుకు చేసారు ?

radha 01012021 21

వాళ్ళలో ఉన్న ఉద్దేశాలు కూడా ప్రభుత్వం విచారణ చేసి బయట పెట్టాలని అన్నారు. ఈ రెక్కీ ఎలా జరిగింది, తదితర వివరాలని రాధాని అడిగి తెలుసుకున్నా అని, అధైర్య పడవద్దు అని, ధైర్యంగా ఉండాలని రాధాకు, ఆమె తల్లికి కూడా చెప్పినట్టు చంద్రబాబు చెప్పారు. అయితే రాధా రెక్కీకి సంబంధించి, తన వద్ద ఉన్న వివరాలను, రాధా చంద్రబాబుకి చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా తన పై రెక్కీకి సంబంధించి, ఏమి జరిగింది, ఆ రోజు వంశీ, నాని రావటం, ఆ తరువాత గుడ్లవల్లేరులో జరిగిన మొత్తం అంశాన్ని కూడా రాధా వివరించారు. తరువాత తనకు ఇచ్చిన గన్ మెన్ల వివరాలు కూడా రాధా చంద్రబాబుకి చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు రెండు రోజుల క్రితం రాధాతో ఫోన్ లో మాట్లాడారు. రెండు రోజుల నుంచి, టిడిపి నాయకులు రాధా ఇంటికి వెళ్లి కలిసారు. ఈ రోజు చంద్రబాబు, పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రాం అనంతరం, చంద్రబాబు తాడేపల్లిలో ఉన్న రాధా నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇప్పటికీ ఈ విషయం వెనుక, ఎవరు ఉన్నారు అనేది పోలీసులు మాత్రం బయట పెట్టలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read