సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. రాజకీయాల్లో కూడా, అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మోదీతో ఓ ఎన్నికల సన్నాహాసభ పెట్టేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. జనవరి 6న గుంటూరులో మోడీ సభ పెట్టనున్నారు. బీజేపీ వాళ్లకి, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లకి, ఏమి చెయ్యకపోయినా, అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పటం అలవాటు. అందుకే ఈ ప్రచారం తిప్పికొట్టటానికి, ఏపీకి బీజేపీ చేసిన అన్యాయమేమిటో .. కేంద్రం సాయం లేకపోయినా సాధించిన ప్రగతి ఏమిటో శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసేందుకు, చంద్రబాబు కౌంటర్ ప్లాన్ చేసారు. అటు మోడీకే కాదు, ఇటు జగన్, పవన్ ల పిచ్చి ఆరోపణలకు కూడా చెక్ పెట్టే ప్లాన్ వేసారు. శ్వేతపత్రాలతో ప్రతిపక్షాలపై చంద్రబాబు అస్త్రాలను ఎక్కు పెడుతున్నారు.

modi 19122018 2

2014లో అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రం ఉన్న పరిస్థితి పై ఆనాడు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, తీసుకువచ్చిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఎన్నికలకు నాలుగు నెలలు సమయం ఉండగానే.. ఎపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరం ప్రారంభమైంది. జనవరి ఆరో తేదీన ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు సభలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన సంస్థలు, నిధుల పై ఆయన ప్రజలకు వివరించడంతో పాటు, బీజేపీ ఎపీ అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 జూన్ లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశంలోనే ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించబోతున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రాంతంలో సభ పెట్టి తెలుగుదేశం పై విరుచుకుపడ్డారు. పాదయాత్రలో జగన్ కూడా ప్రభుత్వం పై అదేపనిగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో వీటిని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం ఎన్నికలకు ముందు పెద్ద కసరత్తే ప్రారంభించింది.

modi 19122018 3

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పారిశ్రామిక పురోగతి, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమలో సాధించిన అభివృద్ది, రాజధాని, పోలవరం నిర్మాణం, రాయలసీమకు సాగు, తాగు నీరు, రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, రాయలసీమలో పరిశ్రమలు, విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు వంటి పలు అంశాల పై రాష్ట్ర ప్రభుత్వం తాజా గణాంకాలతో శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు కేంద్రం నుంచి సాధారణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయకపోవడం వంటి అంశాలపై ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీటన్నింటిపై ఎనిమిది శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు గణాంకాలతో సిద్దం కావాలని ఆయా శాఖల అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రావాల్సిన నిధులను ఇచ్చి వాటిని ఆంధ్రప్రదేశ్ కు ఏదో ప్రత్యేకంగా ఇచ్చామని పేర్కొనడం పట్ల ప్రభుత్వం తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేస్తోంది.ఇటువంటి అంశాలతో శ్వేత పత్రాన్ని విడుదల చేసి బీజేపీని, డిఫెన్స్‌లోకి నెట్టాలనేది తెలుగుదేశం ప్రయత్నంగా ఉంది. నాలుగున్నర సవంత్సరాల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ఇదే సమయంలో ప్రతిపక్షాల ఆరోపణలు కూడా తిప్పికొట్టినట్లువుతుందని సీఎం భావిస్తున్నారు. అదే సమయంలో.. ఏపీ సమస్యల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును కూడా... చంద్రబాబు ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందే ఎవరేమిటో.. తేలిపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read