కొద్దిరోజులుగా బిజీ బిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయానికి రానున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. అయితే, సచివాలయంలో ఎలాంటి ఎలాంటి సమీక్షలు ఉండవని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. సీఎం సమీక్షలు చేయడంపై గతంలో ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమీక్షలు నిర్వహించకుండా ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఫణి తుఫాను హెచ్చరికల సందర్భంగా 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ సడలించాలని నిన్న ఈసీకి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.

cbn 02052019

ఇదిలాఉండగా, అతి భీకరంగా దూసుకొస్తున్న తుపాన్ ‘ఫణి’ సహాయక చర్యలు చేపట్టేందుకు ముందస్తు జాగ్రత్తగా ఒడిశాకు.. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ మినహాయింపు ఇచ్చింది. ఒడిశాలో నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన చివరి విడత ఎన్నికలు ముగియడం.. అదే సమయంలో.. తుపాను ప్రభావం కనిపించడంతో ఈసీ.. కోడ్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆ నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి వెసులుబాటు ఇవ్వాలని ఈసీని చంద్రబాబు కోరారు.

 

cbn 02052019

బుధవారం చంద్రబాబు ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పని చేసేందుకు కూడా ముఖ్యమంత్రులు ఎన్నికల కమిషన్‌ను అడుక్కోవాలా అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో సమీక్షలకు అవకాశమివ్వాలని ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఢిల్లీకి వెళ్లి, ఈసీని కోరాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో అక్కడ కొన్ని జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు. ఒడిసాకు ఇచ్చిన మినహాయింపు ఏపీకి ఎందుకు ఇవ్వరు? శాడిజమా? ప్రధాని చెబితే తప్ప ఇవ్వరా? అని ప్రశ్నించారు. ‘‘తుఫాను ముంపు మనకూ ముంచుకొస్తోంది. ఎన్నికల నియమావళి నుంచి ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు. తుఫానుపై సమీక్షకు కూడా ఈసీ అనుమతి తీసుకోవాల్సి రావడం పెత్తందారీ పోకడలకు నిదర్శనం. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు’’ అని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read