ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, జగన్ పై మొదటి పోరాటం ప్రారంభించనున్నారు. తన హయంలో అదుపులో ఉన్న శాంతి భద్రతలు, ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉండటం, తద్వారా పెట్టుబడుల పై ఆ ప్రభావం ఉండటంతో, రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ప్రాణాలు కాపాడటం కోసం, మొదటి పోరాటం ఎంచుకున్నారు. మరో పది రోజుల్లో అసెంబ్లి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ విషయాలు అన్నీ అసెంబ్లీలో లేవనెత్తటానికి, ఆయన క్షేత్ర స్థాయి పర్యటన చెయ్యనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, గడిచిన 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై దాడి చేసి, ఆరుగురుని చంపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, మరణించిన కార్య కర్తల కుటుంబాలను ఆదుకునేందుకు, వారికి పార్టీ అండగా ఉంటుంది అనే భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబు భరోసా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇచ్చి, అప్పుడు స్పందించాలని మొదట చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాని రోజు రోజుకీ దాడులు పెరిగిపోతూ ఉండటంతో, ఇక ఉపేక్షించేది లేదని, చంద్రబాబు నిర్ణయం తీసుకుని, శాంతి భద్రతల విషయంలో, జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి చంద్రబాబు రానున్నారు.

ఇందులో భాగంగా ఎన్నికల తరువాత తమ పార్టీ కార్యకర్తల పై జరిగిన 140 దాడులను, 6 మంది కార్యకర్తల హత్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. జగన్ ఫాక్షన్ మనస్తత్వాన్ని ప్రజలకు వివరించనున్నారు. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే విషయం ప్రజలకు చెప్పనున్నారు. ఈ యాత్ర గురించి సోమవారం గుంటూరు పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో దీని పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జగన్ ప్రభుత్వం తన పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, దీని కోసం ప్రజా వేదిక లాంటి ప్రభుత్వ కట్టడాలు కూడా కూల్చేస్తుంది అనే విషయాన్ని చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. వైసీపీ దాడుల వల్ల మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే కాకుండా, ఒక్కో కుటుంబానికి పార్టీ తరుపున రూ.5 లక్షలు అందించనున్నారు. ఇది ఇలా ఉంటే, కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను కూడా త్వరలో ఏర్పాటు చెయ్యనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read