బీజేపీ వైఖరి పై విసిగెత్తిపోయిన చంద్రబాబు, ఈ రోజు అసెంబ్లీ వేదికగా ఫుల్ స్టాప్ చెప్పబోతున్నారా ? బీజేపీకి రాం రాం చెప్పి, బీజేపీ చేసిన అన్యాయం పై అసెంబ్లీ వేదికగా చెప్పబోతున్నారా ? అవును అనే సంకేతాలు అమరావతి నుంచి వార్తలు వస్తున్నాయి... గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు చెప్పే సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాల్సి ఉంటుంది... ఈ సమయంలో చంద్రబాబు కేంద్రం చేస్తున్న అన్యాయం పై అన్ని విషయాలు చెప్పి, చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే బీజేపీ కి రాం రాం చెప్పే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది...
ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ బీజేపీ హైకమాండ్ , రాష్ట్ర బీజేపీ మంత్రులకు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. చంద్రబాబు పొత్తుకు రాం రాం చెప్పినా, కేంద్ర మంత్రులు బయటకు వచ్చేస్తారని ప్రకటించినా, వెంటనే బీజేపీ మంత్రులు కూడా రాష్ట్రంలో రాజీనామా చెయ్యాలని, అమిత్ షా ఆదేశించినట్టు సమాచారం... అలాగే ఒకవేళ పొత్తు పై, ఏమి మాట్లాడుకుందా కేంద్రం చేస్తున్న అన్యాయం పై మాత్రమే చెప్తే, దానికి దీటుగా సమాధానం చెప్పాలని ఆదేశాలు వచ్చయి... దీంతో ఈ రోజు చంద్రబాబు ఏమి మాట్లాడుతారో అనే ఆసక్తి దేశం మొత్తం చూస్తుంది....
ఏపీ విషయంలో కేంద్రం వైఖరిపై టీడీపీ ఎంపీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడం లేదన్న కేంద్రం వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడంలో దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు. పోలవరానికి ఇచ్చిన నిధులకు ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నామని, యూసీలు ఇవ్వకుండా నిధులు ఎలా ఇస్తున్నారని సీఎం ప్రశ్నించారు. రెవెన్యూలోటు కింద ఇచ్చిన నిధులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర సంస్థలకు ఇచ్చిన రూ.600కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, వాటి ఆధ్వర్యంలో ఉన్న శాఖలని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని జాతీయమీడియాతో చెప్పాలని ఎంపీలకు ఆదేశించారు.