నంద్యాల ఉప ఎన్నికల్లో 27,456 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు, తన స్టైల్ లో థాంక్స్ చెప్పనున్నారు చంద్రబాబు... ఇందు కోసం, ఎప్పుడూ లేని విధంగా, చంద్రబాబు స్వయంగా వెళ్లి అక్కడ ప్రజలకు కృతజ్ఞత చెప్పనున్నారు... ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో కృతజ్ఞతా సభ పెట్టి, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు.

ఎప్పుడూ ఎలక్షన్స్ ముందు వచ్చి, ప్రజలను ఓట్లు అడిగి వెళ్ళిపోయే నాయకులే కాని, ఇలా ఓటర్లకు గెలిపించినందుకు, ఒక ముఖ్యమంత్రి వెళ్లి థాంక్స్ చెప్పటం, ఎప్పుడూ లేదేమో...

దీనికి చాలా కారణాలే ఉన్నాయి... ఒకటి, నంద్యాల ఎన్నికలతో, చంద్రబాబు ఢిల్లీ నుంచి, గల్లీ దాకా చాలా మంది నోర్లు ముపించారు... టీవీల్లో, సోషల్ మీడియాలో బుల్డోజ్ చేసి, చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్నంగా ఉంది అనే అభిప్రాయం సృష్టించారు... కాని గ్రౌండ్ లెవెల్ లో, సీన్ వేరేగా ఉంది... రెండోది, చంద్రబాబు ఈ ఎలక్షన్ లో, అభివృద్ధి అజెండాగా, ప్రజలని ఓట్లు అడిగారు.. ఏమి చేసాను, ఏమి చేస్తాను అనే విషయాలు మాత్రమే చెప్పారు... అందుకే ప్రజలకు, మీకు అండగా ఉంటా, ఎన్నికల కోసం కాదు, మీకు చెప్పినవి అన్నీ చేస్తాను, అనే కాన్ఫిడెన్సు క్రియేట్ చెయ్యటానికి కూడా వెళ్తున్నారు...

మీటింగ్ ఒక్కటే కాదు, విద్యార్థులతో ముఖాముఖి, పొదుపు మహిళలతో ముఖాముఖిలో కూడా పాల్గుంటారు... చంద్రబాబు మళ్ళీ అభివృద్ధి అజెండానే ముందుంచి, నంద్యాల ప్రజల మనసులు గెలవటానికి, ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకి నంద్యాలకు కృతజ్ఞత చెప్పనున్నారు... అందుకే ఇది చంద్రబాబు స్టైల్ థాంక్స్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read