తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు నుంచి ప్రజల బాట పట్టనున్నారు. గత వారం ఆయన సతీమణి పై హేయమైన భాషతో, అసెంబ్లీలో వైసీపీ చేసిన రచ్చకి చంద్రబాబు బాధపడిన విషయం తెలిసిందే. చంద్రబాబుని అలా చూసిన అనేక మంది చలించిపోయారు. భువనేశ్వరి పై చేసిన వ్యాఖ్యలతో, వైసీపీ ఎలాంటి పార్టీ అనేది మరోసారి రుజువు అయ్యింది. అయితే చంద్రబాబు అలా బాధ పడటం చూసి, ఆయన మళ్ళీ మామూలు రాజకీయాలు చేయటానికి సమయం పడుతుందని అందరూ భావించారు. అయితే అనుకోని పరిస్థితిలో వరదలు రావటంతో, నాలుగు జిల్లాల ప్రజలు అల్లడిపోతున్నారు. అటు పక్క ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో ప్రాధాన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్య నాయకులతో టెలి-కాన్ఫరెన్స్ తీసుకున్నారు. అసెంబ్లీలో మనకు జరిగిన అవమానం పై మనకు బాధ ఉందని, అయినా దాన్ని పక్కన పెట్టి, ప్రజల కోసం మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిలాల్లో, తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న చంద్రబాబు, తాను నేరుగా రంగంలోకి దిగితే కానీ, ప్రభుత్వంలో చలనం రాదనీ, వరద ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తానని చెప్పారు.
ఈ రోజు నుంచి చంద్రబాబు పర్యటన ఉండనుంది. చంద్రబాబు ప్రకటనతో, టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తమ అధినేతను ఎప్పుడూ లేనిది, బాధ పడుతూ చూసిన టిడిపి శ్రేణులు, ఆయనే ప్రకటిస్తూ, మన బాధ పక్కన పెట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పటంతో, సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే టిడిపి శ్రేణులతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా రంగంలోకి దిగింది. వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా రంగంలోకి దిగటంతో, ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా, ప్రజలను అప్రమత్తం చేయటం, డ్యాంల దగ్గర, కట్తల దగ్గర సరైన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోలేదని టిడిపి విమర్శిస్తుంది. ఇంత భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం, మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని, అయినా జగన్ మోహన్ రెడ్డి గాల్లో తిరిగుతూ, చేతులు దులుపెసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు పర్యటన రెండు రోజుల పాటు, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో కొనసాగనుంది.