పెథాయ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం తుఫాను పై సమీక్ష చేసి, తగు ఆదేశాలు ఇచ్చి, రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. తుపాను నేపథ్యంలో చంద్రబాబు వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. రాజమహేంద్రవరం లేదా విశాఖలో విమానం దిగే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణం దృష్ట్యా సీఎం నేరుగా అమరావతి రానున్నట్లు సమాచారం. సీఎం ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 4.30కి చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు. మంగళవారం సీఎం కాకినాడ, విశాఖ వెళ్లే అవకాశం ఉంది. ముందుగా అమరావతిలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం మంగళవారం క్షేత్రస్థాయి వెళ్తారు.

vizag 17122018 2

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం ఉంటుందన్న అంచనాలతో కీలకశాఖల మంత్రులను విశాఖ రావాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు ఉన్నతాధికారులు ఇప్పటికే విశాఖకు బయలుదేరారు. మరో వైపు ఇప్పటికే చినరాజప్ప, నారాయణ, గంటా, గ్రౌండ్ జీరోలో ఉండి పరిస్థతి సమీక్షిస్తున్నారు. 18 మండలాల్లోని 295 గ్రామాల్లో పునరావాస చర్యలు చేపట్టారు. ఇప్పటికే 84 జేసీబీలు, 83 జనరేటర్లు, 87 వాటర్‌ ట్యాంకర్లు, 5 లక్షల వాటర్‌ ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే 1,978 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 677 మెట్రిక్‌ టన్నుల చక్కెర, 1,335 మెట్రిక్‌ టన్నుల పప్పు, పామాయిల్‌ సిద్ధం చేసినట్లు నారాయణ వెల్లడించారు.

vizag 17122018 3

వ్యవసాయం, పౌరసరఫరాలు, పశుసంవర్ధకశాఖ, విపత్తు సహాయదళం, అగ్నిమాపకశాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, పాఠశాల విద్య, గ్రామీణ నీటిసరఫరా, విద్యుత్‌, పైబర్‌నెట్‌, వాటర్‌గ్రిడ్‌ ఉన్నతాధికారులు వెంటనే కాకినాడకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కృష్ణా జిల్లాలోని ఐదు మండలాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సబ్‌కలెక్టర్లను నియమించారు. నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం రూరల్‌, అర్బన్‌.. కృత్తివెన్ను మండలాల్లో సబ్‌కలెక్టర్లు సహాయ చర్యలను పర్యవేక్షించనున్నారు. పెథాయ్‌ తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరం తాకింది. అక్కడి నుంచి పెథాయ్‌ తన దిశ మార్చుకుని ఈశాన్య మార్గంలో పయనించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ తుపాను ఒడిశా, పశ్చిమ్‌బంగా రాష్ట్రాల్లోనూ తన ప్రభావం చూపిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read