గత 5 ఏళ్ళుగా నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా, అలుపు సొలుపు లేకుండా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, కష్ట పడ్డారు. చివరకు పార్టీని పట్టించుకోలేదు అనే అపవాదు కూడా మూట కట్టుకున్నారు. అంతే కాదు, పార్టీని పట్టించుకోక పోవటం వల్లే, కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారని, ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణం అనే విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. ఈ తరుణంలో, చంద్రబాబు ఓడిపోవటం, ప్రతిపక్ష నేత అవ్వటం జరిగిపోయాయి. ప్రతి రోజు ప్రజలు, ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చి, వారి కష్టాలు తెలుపుకుని వెళ్తున్నారు. మరో పక్క ప్రజా అవేదికను ప్రతిపక్ష నేతకు ఇచ్చే ఇంటిలో భాగంగా, తనకు ఇవ్వాలని, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా, దాని పై సమాధానం ఇవ్వకుండా, రాత్రికి రాత్రి దాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత మూడు రోజులుగా, చంద్రబాబు తన ఇంట్లోనే ప్రజలను కలుస్తున్నారు. అదే విధంగా, పార్టీ నాయకులతో సమావేశాలు కూడా తన ఇంటి నుంచే చేస్తున్నారు.

అయితే ఇక నుంచి తన వర్కింగ్ స్టైల్ మార్చనున్నారు చంద్రబాబు. ఇక నుంచి వారంలో అయిదు రోజుల పాటు గుంటూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు, ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. చంద్రబ్బు కోసం, ఇప్పటికే గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేసారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి రోజు చంద్రబాబుతో పాటు, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్‌, ఏపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా, వారంలో అయిదు రోజులపాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. మంగళగిరి సమీపంలో, తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ నిర్మిస్తున్నారు. అది సెప్టెంబర్ చివరకు పూర్తి కానుంది, అప్పటి వరకు చంద్రబాబు గుంటూరు నుంచే పని చేస్తున్నారు. ఎక్కువ సమయం కార్యకర్తలతో గడపనున్నారు. క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవటమే ధ్యేయంగా చంద్రబాబు తన టీంని రెడీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు బుధవారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read