ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ద్రోహం చేసిందని ఆయన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున హామీ ఇచ్చిందని.. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ద్రోహం చేసిందని ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఫిబ్రవరి 20, సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ద్రోహం చేసి ఐదేళ్లు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి ప్రత్యేక హాదాతో సహా మరో 5 హామీలు గాలికి వదిలేసింది. వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకుంది. బీజేపీ చేసిన ఈ నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి’’ అని ట్విట్టర్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.

tweet 20022019

సరిగ్గా నేటికి ఐదేళ్ళ క్రితం... తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమం, అభివృద్ధి ఆగకుండా ముందుకు సాగేందుకు వీలుగా... రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఏపీకి ఆరు హామీలిచ్చారు. ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వం పై ఉంది. అయితే మోడీ ప్రభుత్వం ఆ హామీలను తుంగలో తొక్కింది. ఏపీకి నమ్మక ద్రోహం చేసింది. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి 5 ఏళ్లు అయిన సందర్భంలో తమ నిరసనలు తెలుపుతున్నారు ఏపీ ప్రజలు. నవ్యాంధ్ర ప్రజల తరపున ఒక్కో హామీని గుర్తుచేస్తూ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం.

tweet 20022019

ఇవి ఆ హామీలు: హామీ నెం.1 - ప్రత్యెక హోదా. హామీ నెం.2 - దేశంలోని మరికొన్ని రాష్ట్రాలతో సమానంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు, హామీ నెం.3 - కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, హామీ నెం.4 - పోలవరం ప్రాజెక్టు సహాయ, పునరావాసం సున్నితంగా అమలయ్యేలా చట్టానికి సవరణ, హామీ నెం. 5 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి... అంటే 2014 జూన్ 2 నాటికే సంతృప్తికర రీతిలో ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు -అప్పుల పంపిణీ పూర్తి కావాలి. హామీ నెం.6 - రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది తలెత్తే రెవెన్యూ లోటు భర్తీ. ఇంకా ఎన్నాళ్ళు సాగాలి ఈ పోరాటం? ఒక రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఐదేళ్ళయినా సరిదిద్దక పోగా, మరింత అన్యాయం జరిగేలా రాష్ట్రంపై కుట్రలు చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకోవడం ఎంత దారుణం? ఈ వివక్షను, కక్షను ప్రశ్నిస్తోంది తెలుగుదేశం. సాక్షాత్తూ దేశ ప్రధాని, అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే విలువ లేకపొతే ఇంకెక్కడి ప్రజాస్వామ్యం? మాజీ ప్రధాని ఇచ్చిన ఆరు హామీలకు నేడు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రతి నవ్యాంధ్ర పౌరుని తరపున మోడీని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read