కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు, మోడీ, అమిత్ షా చేస్తున్న నీఛ రాజకీయం, గవర్నర్ ఆడుతున్న నాటకాలు, సుప్రీం కోర్ట్ తీర్పు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు... "గౌరవ సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రోటెం స్పీకర్ ఎన్నికలో గవర్నర్, రాజ్యాంగం చెప్పిన విధంగా పాటించాలని చెప్పారు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు, స్పూర్తి నిలబడాలని చెప్పారు.. "We respect & welcome the verdict of Hon'ble Supreme Court. Governor should have followed the Democratic conventions in appointing protem speaker. We expect that the spirit of Supreme Court judgement will be protected."

cbn tweet 18052018 2

ప్రోటెం స్పీకర్‌‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్యను గవర్నర్ నియమించటం వివాదాస్పదం అవ్వటంతో, చంద్రబాబు ట్వీట్ చేసారు. కర్ణాటక విధానసౌధ ప్రోటెం స్పీకర్‌‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్య నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆర్‌వీ దేశ్‌పాండేను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే గవర్నర్ వాజూభాయ్ వాలా ఊహించని రీతిలో బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తీరును తప్పుబట్టింది. కర్ణాటక గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ప్రోటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం జరుగుతుందని.. ఈ ప్రకారం చూసుకుంటే దేశ్‌పాండే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆయన చెప్పారు.

cbn tweet 18052018 3

ఇది ఇలా ఉండగా, జేడీఎస్‌ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి గురువారం చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. 1984లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని చెప్పారు. ‘161 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కర్టాటకలోని నంది హిల్స్‌లో క్యాంప్‌కు వెళ్లాం. అసెంబ్లీలో బల నిరూపణ సమయం వరకూ ఒక్కరు కూడా మా నుంచి విడిపోలేదు. మీరు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’ అని కుమారస్వామికి సలహా ఇచ్చారు. జేడీఎస్-కాంగ్రెస్‌ కూటమికి మెజారిటీ ఉన్నా తమను కాదని.. ప్రభుత్వ ఏర్పాటుకు అప్రజాస్వామికంగా గవర్నర్‌ బీజేపీకి అవకాశం ఇచ్చారని జేడీఎస్‌ నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్‌ నిర్ణయం అప్రజాస్వామికమని దేశమంతా భావిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read