ప్రధాని మోదీ రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా, తెలుగుదేశం పై చేసిన ట్వీట్ లకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విటర్‌లో ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వారు అవినీతి, కుటుంబ రాజకీయాలు కోరుకోవడం లేదు. అందువల్ల అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఇది నా పూర్తి విశ్వాసం’ అని ఉదయం మోదీ ట్వీట్‌ చేశారు. దీనికి చంద్రబాబు కూడా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ‘ఆర్థిక నేరస్థులతో అంటకాగుతూ అవినీతి గురించి మీరా మాట్లాడేది?’ అని ఎదురు ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

modi 014042019

రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి.. మట్టి, నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిగ్గు వెయ్యడం లేదా అని నిలదీశారు. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్థిక నేరస్థులతో అంటకాగుతున్నారంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యాంకులను దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. ‘మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ!’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వా్మ్యానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఈ దుర్మార్గపు పరిపాలనకు త్వరలోనే ముగింపు పలకాలని దేశ, రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

modi 014042019

"ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ?" అంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read