కేంద్ర విధానాల పై దేశ వ్యాప్తంగా పోరాడుతూ, ముఖ్యంగా ఈవీఎంల పై, మహిళా రిజర్వేషన్ పై, చంద్రబాబుకి మద్దతు తెలుపుతూ, దేశ రాజకీయాల్లో కూడా మద్దతు ప్రకటిస్తూ, ఒరిస్సా సియం నవీన్ పట్నాయిక్ నిన్న తన ప్రతినిధిని అమరావతి పంపించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును, ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ కలిసి మద్దతు ప్రకటించారు. దీని పై చంద్రబాబు ట్వీట్ చేసారు. "ఒడిషా, ఆంధ్రప్రదేశ్ మధ్య స్నేహపూరిత సంబంధాలకు ముందడుగు వేశాం. ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ ద్వారా జాతీయ స్థాయిలో మేము చేస్తోన్న పోరాటానికి మద్దతిచ్చిన ఒడిషా ముఖ్యమంత్రి @Naveen_Odishaకు అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకుంటాం." అంటూ ట్వీట్ చేసారు.

manikyalarao 25122018

మంగళవారం అమరావతికి వచ్చిన బీజేడీ ఎంపీ, సీఎం చంద్రబాబును కలిసి తమ నేత అభిమతాన్ని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తోన్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతోన్న ఏపీ చంద్రబాబు డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. తాను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని తన లేఖలో నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

manikyalarao 25122018

అలాగే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపైనా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోసారి బీజేపీ రాకూడదన్నది తమ సీఎం అభిప్రాయమని, ఈవీఎంలకన్నా, బ్యాలెట్ పేపర్లపైనే తమకు ఎక్కువ విశ్వాసముందని సౌమ్యా రంజన్ పట్నాయక్ అన్నారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అంశాన్ని కంప్యూటర్ చిప్‌లను తయారు చేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సౌమ్యా రంజన్ కూడా అంగీకరించారు. వీరిద్దరి భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read