Sidebar

13
Tue, May

టెక్ సావీ ముఖ్యమంత్రిగా, పరిపాలనలో టెక్నాలజీ జోడించి, అద్భుతమైన పరిపాలన అందించే పేరు ఉన్న, చంద్రబాబు ట్విట్టర్ లో ఒక ల్యాండ్ మార్క్ ను సాదించారు... ఆయన ట్విట్టర్లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 4 మిలియన్లకు చేరింది. ట్విట్టర్‌లో తనకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ.. స్పందించిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా ‘‘చౌక దుకాణాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి.. 500లకుపైగా నాణ్యమైన సరుకులు అందుబాటుధరల్లో అందించేందుకు రేషన్ షాపుల స్థానంలో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశాం’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

cbn tech 04062018 2

ఈ సందర్భంగా చంద్రబాబు ని అభినందిస్తూ పలువురు ట్వీట్లు చేశారు. 2009లో చంద్రబాబు ట్విట్టర్ లోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఆయన భావాలను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటనల వివరాలు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పధకాలకు సంబంధించిన విషయాలను ఆయన అభిమానులతో, ప్రజలతో పంచుకునేందుకు ట్విట్టర్ వేదికగా మలుచుకున్నారు. 2009లోనే ట్విట్టర్లో అకౌంట్ తెరిచిన చంద్రబాబు, ఇప్పటి వరకూ దాదాపు 4 వేల ట్విట్లు చేసారు. దీన్ని బట్టి ఆయన ఎంతలా సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు సాంఘిక మాధ్యమాల ద్వారా తమ వ్యక్తిగత విశేషాలను రాజకీయ అంశాలను అందరితో పంచుకుంటున్నారు.

cbn tech 04062018 3

అయితే, ఈ సందర్భంలోనే చంద్రబాబుని అభినందిస్తూ, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా, సోషల్ మీడియాలో వెనుకబడిన ఉన్న అంశాన్ని, పలువురు చంద్రబాబు అభిమానులు, ఆయన ద్రుష్టికి తీసుకువస్తున్నారు. చంద్రబాబు లాంటి టెక్ సావీ నేత సారధ్యంలో పార్టీ కాని, ప్రభుత్వం కాని, విపక్షాలకు ధీటుగా సోషల్ మీడియాలో స్పందించటం లేదనే విషయం గుర్తు చేస్తున్నారు... అవతల పక్క, వైసిపీ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, జనసేన దేవ్ బ్యాచ్, ప్రత్యెక టీంలు పెట్టుకుని, సోషల్ మీడియాలో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చేస్తుంటే, మనం కనీసం చేసింది కూడా చెప్పుకోవటం లేదని, ఆ విషయంలో కొంచెం దూకుడుగా ఉండాలని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read