ఢిల్లీ పెద్దలు, పూర్తిగా వదిలేసారు... రాష్ట్రానికి రూపాయి కూడా అదనంగా ఇవ్వకూడదు అనే నిబంధన పెట్టుకున్నారు... చంద్రబాబుని సాధించాలి, తద్వారా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టి, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలి, ఇది బీజేపీ పెద్దల తీరు... ఈ కోవలోకే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి హ్యాండిచ్చింది... కందుల కొనుగోలు పరిమితిని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం స్పందించలేదు. రాష్ట్రంలో ఈ ఏడాది కందుల దిగుబడి గతం కంటే బాగా వచ్చింది. రాయలసీమకు నీరివ్వడం, వాతావరణం అనుకూలించడంతో దాదాపు 2లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి రావొచ్చని అంచనా.

cbn kendram 19032018 2

అయితే వీటికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కేంద్రం మెలిక పెట్టింది. కేవలం 45,200 మెట్రిక్‌ టన్నుల వరకే గిట్టుబాటు ధర ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రైతుల కోసం ఆ భారం భరించాలని, మిగిలిన 1.5లక్షల మెట్రిక్‌ టన్నులను కూడా మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరైన ఆయన దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.

cbn kendram 19032018 3

ప్రస్తుతం కందుల మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450గా ఉంది. కానీ బహిరంగ మార్కెట్‌లో ధర రూ.4వేల వరకే ఉంది. మార్కెట్‌ ధర, మద్దతు ధర ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. కానీ కేంద్రం పెట్టిన మెలిక కారణంగా ఇప్పుడు రాష్ట్రమే మొత్తం వ్యత్యాసాన్ని భరించాల్సి ఉంటుంది. ఒక్కో రైతునుంచి 25క్వింటాళ్లకు మించకుండా కందులను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.200కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని కరువు మండలాల్లో 50రోజుల అదనపు పనిదినాలను కల్పించే ఫైలుపైనా చంద్రబాబు సంతకం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read