ఎప్పుడో, 2010లో జరిగిన ప్రజా ఆందోళన... అప్పట్లోనే మహరాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు పై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంది.. అయితే, ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళ తరువాత, ఎవరో పిటీషన్ వేసి, ఆ కేసు ఏమైంది అని అడగటం, ఆ కేసు ఇంకా ఓపెన్ చేసే ఉంది, వాయదాలకు రావటం లేదు అని తెలుసుకుని, నాన్ బైలబుల్ వారంట్ ఇవ్వటం, చంద్రబాబుకి నోటీసులు, అరెస్ట్ అంటూ వార్తలు రావటం, ఇవన్నీ ఇప్పుడు ఎందుకో ఎవరికీ అర్ధం కావటం లేదు. నువ్వు మాకు ఎదురుతిరిగావ్, నీ మీద కేసులు పెడుతున్నాం, సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, ఇన్కమ్ టాక్స్ వస్తుంది అంటూ, గత ఆరు నెలలుగా బీజేపీ నాయకులు చేస్తున్న హంగామా చూస్తున్నాం..
వారినికి ఒక ఆరోపణ తీసుకువచ్చి, చంద్రబాబు అవినీతి చేసారు అంటూ గాల్లో కబురులు చెప్పి, అదిగో చంద్రబాబు అరెస్ట్, ఇదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ, చివరకి ప్రజా ఆందోళన పై చేసిన ఒక పిల్ల కేసు తీసుకుని నోటీసులు ఇచ్చి, అరెస్ట్ వారంట్ ఇచ్చారు. అంటే, చంద్రబాబు అవినీతి పై వీళ్ళకు ఆధారాలు ఏమి దొరక్క, వీళ్ళ ఇగో చల్లార్చుకోవటానికి, ఇలా నోటీస్ పంపించారా ? లేక తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే, అది దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది అనే భయంతో, చంద్రబాబుకి వార్నింగ్ లాగా, ఈ కేసు బయటకు తీసారా ? ఇన్ని చర్చలు జరుగుతున్న సమయంలో, తెలుగుదేశం పార్టీ మరొక చర్చకు కూడా తెర లేపింది.
మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు, ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ఎనిమిది ఏళ్ళుగా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీయం చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్ని తెలుగు దేశం నేతలు తప్పుబడుతున్నారు. ఈ నెల 23న చంద్రబాబు అమెరకా వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరగనున్న ఈ సదస్సులో సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు నిలిచిపోనుంది. ఇవన్నీ తట్టుకోలేని ఢిల్లీ పెద్దలు, ఈ టూర్ ఆపటానికి, సరిగ్గా చంద్రబాబు అమెరికా బయలుదేరే సెప్టెంబర్ 21 నే ఎంచుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా అమెరికా పర్యటన ఆగదని, కోర్ట్ కి విషయం చెప్పి, అమెరికా పర్యటనకు వెళ్లి, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అమెరికాలో, ఐక్యరాజ్య సమితిలో ఎగరేస్తామని, ఎవరు అడ్డుపడినా, ఆగేది లేదని అంటున్నారు.