విభజన చట్టంలో హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి.. నాలుగేళ్లయినా కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభలో చంద్రబాబు పాల్గొన్నారు. హక్కులను సాధించుకునేందుకే కేంద్రంతో విభేదించామని... దీంతో, రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఆపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని... సవరించిన అంచనాలను ఇంకా ఆమోదించలేదని చెప్పారు. కడప ఉక్కు కర్మాగారాన్ని విస్మరించారని మండిపడ్డారు. విజయవాడ, విశాఖపట్నంలకు మెట్రో రైలు ఇవ్వడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. దుగరాజపట్నం ఓడరేవును, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని శాశ్వతంగా పూడ్చిపెడతామని అన్నారు.

cbn tg 29092018

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఉండి ఉంటే.. 90శాతం గ్రాంటు వచ్చేది. రాష్ట్రానికి ఇచ్చిన రూ.1500 కోట్లతో ఎలక్ట్రిసిటీ కేబుల్‌ కూడా రాదు. ఆ నిధులకు యూసీలు ఇవ్వలేదని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఖాతాలో వేసిన సొమ్మును వెనక్కి తీసుకోవడం చట్ట విరుద్ధం. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఏపీకి ఎందుకివ్వరని అడిగాం. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు కర్మాగారం రాకుండా అడ్డుపడుతున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఇతర నగరాల్లో ర్యాపిడ్‌, బుల్లెట్‌ రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్‌లో మన ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశ చరిత్రలో నూతన అధ్యాయం. రాష్ట్రం కోసం పోరాడితే కటకటాలు తప్పవని వైకాపా ఎంపీలు పారిపోయి వచ్చారు. మోదీ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతోంది. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం.. అంతిమంగా గెలిచేది ధర్మం, న్యాయమే" అని అన్నారు.

cbn tg 29092018

ప్రధాని మోదీ అంటే వైసీపీ నేతలకు వణుకు పుడుతుందని... అందుకే రాష్ట్రానికి ఆయన తీవ్ర అన్యాయం చేస్తున్నా, వైసీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు పార్లమెంటులో లేరని, ఇక్కడ అసెంబ్లీలో కూడా లేరని అన్నారు. ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపందలు ఈ వైసీపీ నేతలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి పౌరుషానికి తెలుగుదేశం పార్టీ ప్రతీక అని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది టీడీపీ ఎంపీలేనని అన్నారు. మోదీ బెదిరిస్తే భయపడే రకం టీడీపీ కాదని... ఇది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ఒక బెబ్బులిపులిలా, ఒక కొండవీటి సింహంలా ముందుకు వెళతారని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో మోదీ మాట్లాడిన వీడియోను ప్లే చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read