రాష్ట్రంలో గత 26 రోజులుగా జరుగుతున్న పనులు, దానికి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై, చంద్రబాబు ఫైర్ అయ్యారు. గత రెండు రోజులుగా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా మహిళల పై వ్యవహరిస్తున్న తీరు పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కూడా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ "రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి 1-4-4, పోలీస్ యాక్ట్ 30ని వర్తింపజేయడం లేదు. కానీ.. జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులు వద్దు.. అమరావతే రాజధానిగా కావాలి అంటూ ప్రజలు శాంతియుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసన తెలపడాన్ని కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారు. దుర్గమ్మకు మొక్కు తీర్చుకోవడానికి పొంగళ్లు తీసుకెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేయడం ప్రజా హక్కులను కాలరాయడం కాదా.?"
" శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బూటు కాళ్లతో తన్నడం, బాదడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా.? దీర్ఘ కాలం 1-4-4 సెక్షన్ అమలు చేయడం చట్ట విరుద్దమని సుప్రీం కోర్టు చెప్పినా.. అమరావతి పరిధిలో సుదీర్ఘ కాలం అమలు చేయడం దుర్మార్గం కాదా.? మహిళలపై పోలీసులు దౌర్జ-న్యం చేస్తూ.. గాయాలపాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చేరేలా చేస్తున్నారు. శాంతియుత నిరస-నలకు అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారు.? ఈ రకంగా వివ-క్షా పూరితంగా పోలీసులు వ్యవహరించడానికి డీజీపీ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టబద్ద చర్యలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇకనైనా చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డీజీపీగారు వ్యవహరించాలి." అంటూ చంద్రబాబు అన్నారు.
ఇక తరువాత చంద్రబాబు, గుంటూరులో ని పార్టీ ఆఫీస్ నుంచి, జేఏసీ ర్యాలీలో పాల్గునటానికి వెళ్తున్న సమయంలో, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీర పై కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనతో పాటు వాచ్చే వారిని, ఎందుకు ఆపుతున్నారు అంటూ ఏసీపీ పై చంద్రబాబు ఆగహ్రం వ్యక్తం చేసారు. ఎక్కడా హింస లేకుండా, ప్రభుత్వానికి నిరసన తెలియ చేస్తుంటే, ఈ గోల ఏంటి అంటూ, పోలీసులని నిలదీసారు. స్టూడెంట్స్ వచ్చి ఉద్యమంలో పాల్గుంటే, కేసులు పెడతాం, చదువుకు ఇబ్బంది అంటూ బెదిరిస్తున్నారని, చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రం శాశ్వతం అని, నువ్వు, నేను ఇక్కడ పోయే వాళ్ళం అని, ఇలాంటి రాష్ట్రం కోసం, పోరాడటంలో తప్పు లేదని అన్నారు. మీరు కూడా సహకరించాలని, మహా అయితే వేరే చోట పోస్టింగ్ ఇస్తారని, అంతకు మించి వీళ్ళు ఏమి చేస్తారు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.