విజయవాడలో నిర్మిస్తున్న కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి సంబంధించి కాలువ ప్రవాహాన్ని ఆపడానికి జల వనరుల శాఖతో మాట్లాడామని, రేపటి నుంచి సంబంధిత పనులను ఆరంభిస్తామని అధికారులు చెప్పారు. హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లయ్‌వోవర్ తరహాలో విజయవాడ నగరంలో కీలకమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి వుందని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీయం చంద్రబాబు చెప్పారు. నిర్మాణ సంస్థ చేతకానితనం, అసమర్ధత వల్ల రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతోందని ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వంతెన పైభాగాన్ని 13వ పిల్లర్ వరకు పూర్తిచేసి మార్చి నాటికి ప్రధాన రహదారిపై రాకపోకలు పునరుద్ధరించకపోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. నిర్మాణ సంస్థ కోరినట్టుగా రూ.10 కోట్ల ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.
అలాగే, విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ను నిడమానూరు వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ తరహాలో విజయవాడ నగరంలో కీలకమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి వుందని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన చెప్పారు. చెన్నయ్-కోల్‌కత్తా ఐదవ నెంబర్ జాతీయ రహదారి మార్గంలోని 1025 కిలోమీటర్ల మేర జరుగుతున్న రహదారి అభివృద్ధి పనుల పురోగతిపై జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లయ్‌వోవర్ నిర్మాణం నవంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. విజయవాడ నగర అవసరాల దృష్ట్యా ప్రస్తుత ప్రతిపాదిత మార్గాన్ని మరికొంత దూరం పొడిగించాలని ముఖ్యమంత్రి వారికి చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్: సవరించిన అలైన్‌మెంట్ ప్రకారం 189 కిలోమీటర్ల మేర అమరావతి బాహ్యవలయ రహదారిని రూ.17,762 కోట్ల అంచనాతో నిర్మాణాన్ని చేపడుతున్నామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లయ్‌వోవర్ తరహాలో విజయవాడ నగరంలో కీలకమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి వుందని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన చెప్పారు. దీనికోసం 3,404 హెక్టార్ల మేర భూమి అవసరం వుంటుందని చెప్పగా, సాధ్యమైన మేరకు భూ సమీకరణ విధానంలోనే భూములను తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ బాహ్యవలయ రహదారి మార్గంలో జి.కొండూరులో 5.5 కి.మీ, పేరేచర్లలో 800 మీటర్ల మేర టన్నల్స్ నిర్మాణం జరగాల్సి వుంటుందని అధికారులు చెప్పారు. 87 గ్రామాలు ఈ రహదారి పరిధిలోకి వస్తాయని వివరించారు.