టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ మనపోరాటం వైఎస్సార్ కాంగ్రెస్ తో కాదు, టీఆర్ఎస్ పార్టీతోనని ఉద్ఘాటించారు. "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది కేసీఆర్ ని గెలిపించినట్టే. కేసీఆర్ మనమీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. కేసీఆర్ మనకు అన్యాయం చేశాడు. 60 ఏళ్ల మన కష్టాన్ని దోచుకుని మనల్ని అవమానంతో పంపించారు. కేసీఆర్.. రా!... వచ్చి పలమనేరులో నా పౌరుషాన్ని చూడు అంటూ ప్రతిఒక్కరూ గర్జించాలి, ఖబడ్దార్ కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డంపెట్టుకుని మా జోలికి వస్తే వదిలిపెట్టం. వైఎస్సార్ కాంగ్రెస్ దివాలాకోరు పార్టీ. ఆ పార్టీ నేతలు మోదీకి ఊడిగం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. మైనారిటీలకు రక్షణగా నేనుంటా" అంటూ ప్రసంగించారు.
‘‘ఈ ఎన్నికల్లో మా పోరాటం వైసీపీతో కాదు.. టీఆర్‌ఎ్‌సతోనే. వైసీపీని అడ్డుపెట్టుకుని మా జోలికి వస్తే వదిలిపెట్టం! ఖబడ్దార్ కేసీఆర్.. జాగ్రత్తగా ఉండు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ రా.. మా పాలనను చూడు! మా పౌరుషాన్ని చూడు!’ అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి జగన్ అతిపెద్ద సమస్య అని విమర్శించారు. హైదరాబాద్‌లో టీడీపీ సేవామిత్ర యాప్ సమాచారాన్ని దొంగలించిన కేసీఆర్ దానిని జగన్‌కు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి, టీఆర్‌ఎ్‌సకు వేసినట్లే అని తెపారు. జన్మభూమికి ద్రోహం చేసిన వైసీపీ ఈ గడ్డపై ఉండటానికి వీల్లేదన్నారు. 2014లో కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పినట్లే... ఈసారి వైసీపీకి చెప్పాలని పిలుపునిచ్చారు.
‘‘కేసీఆర్ మనల్ని ఎన్నోసార్లు అవమానించారు. ఆంధ్రవాళ్లు దొంగలు, రాక్షసులు అన్నారు. ఆంధ్రా బిర్యానీ పేడతో సమానం, ఉలవచారు మా వద్ద పశువులు తింటాయి అని అవహేళన చేశారు. అలాంటి కేసీఆర్‌తో జగన్ చేతులు కలిపారు. ఓట్లు వేసి గెలిపిస్తే కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెడతారు’’ అని బాబు తెలిపారు. ‘‘మోదీ, కేసీఆర్, జగన్... ముగ్గురూ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ అన్ని పార్టీలను కొనేశారు. కాంగ్రె్‌సను బలహీనం చేశారు. 16 సీట్లు మావే అని ప్రచారం చేస్తున్నారు. మీరంతా టీడీపీని 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే కేసీఆర్, జగన్, మోదీలు మన జోలికి రారు’’ అని పేర్కొన్నారు. కేసీఆర్ పంపిన వెయ్యికోట్ల సొమ్మును జగన్ పంచుతారని... జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.