తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో, తిరుపతి ఉప ఎన్నికకు సంబందించినటువంటి, ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై నేతలతో చర్చించారు. తిరుపతి నేతలతో పాటుగా, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల, వాటి ఫలితాల పై కూడా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నేతల పై అసహనం వ్యకం చేసారు. గ్రౌండ్ లో పని చేయకుండా కేవలం మీడియాలో కబురులు చెప్తే కుదరదని చంద్రబాబు నయాకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మనం ఎలా పని చేసామో, క్షేత్ర స్థాయిలో ఎలా మన పని తీరు ఉందొ, మొన్న వచ్చిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్ధం అవుతుంది అంటూ, ఒకింత ఘాటుగా స్పందించారు. నిరంతం ప్రజల్లో ఉండి పోరాడేవారికే, గుర్తింపు ఉంటుందని, అందరూ ఇది గ్రహించాలని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక వైఫల్యాలు చేస్తుందని, ప్రజలకు అవన్నీ వివరించి, ప్రజలు, రాష్ట్రం ఎలా నష్టపోతుందో అర్ధమయ్యేలా చెప్పాలని చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేసారు. ప్రతి క్లస్టర్ కు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుని, ప్రజలకు దగ్గరవ్వాలని చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ, ప్రజలు అర్ధమయ్యే రీతిలో వారికీ చెప్పాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారికి చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజవర్గం ఒక క్లస్టర్ గా తీసుకోవాలని, అక్కడ నుంచి వ్యూహాత్మకంగా పని చేస్తూ, ముందుకు వెళ్ళాలని అన్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి భారీ కసరత్తు చేసారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి, అయుదు మందితో ఒక పర్యవేక్షణ కమిటీ ఒకటి వేసారు. ఈ కమిటీలో రాష్ట్ర టిడిపి ఆధ్యక్షుడు అచ్చేన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, పనబాక, నారా లోకేష్, వీరి అయుదుగురితో కూడిన ఒక కమిటీని కూడా , అక్కడ ఎన్నిక కోసం ఏర్పాటు చేసారు. ఈ నెల 24వ తేదీన, తెలుగుదేశం ఎంపీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మి అక్కడ నామినేషన్ వేయనున్నారు. మొత్తంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా, ఇక నుంచి సీరియస్ గా తీసుకోవాలని, తిరుపతి ఉప ఎన్నిక పెద్ద ఎన్నికని, అందరూ కష్టపడి పని చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేసారు. ఇక నుంచి రిజర్వేషన్లు, విధేయతలు, మొహమాటాలు ఇక్కడ పని చేయవని, పని మాత్రమే గుర్తింపు అని చంద్రబాబు అన్నారు.