కర్నూలు జిల్లా ఓర్వకల్లులో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్‌లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై నేతలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిముషాలపాటు చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేతలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. బయటనుంచి వస్తున్న పుకార్లను నమ్మవద్దని అన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 120 స్థానాలకు పైగా గెలుస్తామని, టీడీపీనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.

kurnool 19042019

ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని, పుకార్లు నమ్మవద్దు అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని నేతలకు సూచించారు. కాగా కర్నూలులో సమావేశం అనంతరం సీఎం కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు. అక్కడ రాయచూర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అభ్యర్థి బీవీ నాయక్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. కర్నూల్ జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా బాగుందని.. మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని నాయకులు చంద్రబాబుకు చెప్పినట్లు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.

kurnool 19042019

అంతకు ముందు, కడప జిల్లా ఒంటమిట్టలో గురువారం నిర్వహించిన కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి సీఎం హాజరయ్యారు. ఈ ఉదయం కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటున్నామని పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలుస్తామని జిల్లా నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగానూ తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని.. మరోసారి అధికారం చేపట్టబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read