ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన పని లేదు... దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన చంద్రబాబు అంటే, దేశమంతా గౌరవమే... ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా చంద్రబాబు కీలక పాత్ర పోషించే వారు... ఈ సారి బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది... ఎన్డీఏలో ఉన్న చెప్పుకోదగ్గ పార్టీలు శివసేన, తెలుగుదేశం... పోయిన వారం శివసేన, ఎన్డీఏకు గుడ్ బాయ్ చెప్పేసింది... మోడీతో వేగలేం అని ఘాట్ విమర్శలు చేసింది... మరో పక్క దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు మొదలైయ్యాయి... ఈ తరుణంలో, బీజేపీకి నమ్మకమైన మిత్రుడుగా ఉన్న చంద్రబాబు కూడా అలిగారు...
ఒకే ఒక్క మాట "ఇలా అయితే మా దారి మేము చూసుకుంటాం" అని చెప్పటంతో, ఈ వార్తా నేషనల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది... చంద్రబాబు స్థాయి నేత, బీజేపీ మీద అలిగారు అనే సంకేతం వెళ్తే, అది బీజేపీకే నష్టం.. ఇప్పటికే శివసేన గుడ్ బై చెప్పటం, వారం రోజుల్లోనే చంద్రబాబు, ఒక జర్క్ ఇవ్వటంతో, నిన్న చంద్రబాబు మాటలు నేషనల్ మీడియా హైలైట్ చేసింది... నిన్న చంద్రబాబు రాష్ట్ర బీజేపీ నేతల పై మాట్లాడినా, నేషనల్ మీడియా మాత్రం, మోడీకి లంకె పెడుతూ, కధనాలు రాసింది...
బీజేపీ తమని వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తామని, తమ దారి తాము చూసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిన్న మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ నేతలపై బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బీజేపీతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, మిత్రపక్ష ధర్మం పట్ల బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తాను తమ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని అన్నారు.