ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు అన్నీ చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో రాజకీయ విషయాల పై మాట్లాడుతూ, అధికారులతో కేంద్రం చేసిన అన్యాయం పై మరింత సమాచారం తెప్పించుకుంటూ, సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అవిశ్వాసంపై చర్చకు స్పీకర్‌ ఆమోదం తెలపడంతో చకచకా పావులు కదపాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన, మోడీ వ్యతిరేకుల మద్దతు కూడగట్టేలా మరింత దూకుడుగా వెళ్లాలని అనుకుంటున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహజన్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

cbn 18072018 2

ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సీఎంవో అధికారులు హాజరయ్యారు. భజన చట్టం హామీలు, ఇప్పటివరకు అమలు జరిగిన తీరు, ఏపీకి రావాల్సిన నిధులు, ఆర్థికలోటు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులు.. రావాల్సిన నిధుల గురించి ఫైనాన్స్ సెక్రటరీ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. వీటితోపాటు.. దుగరాజపట్నం పోర్ట్, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వేజోన్, ట్రైబల్ యూనివర్సిటీ వంటి హామీల పురోగతిపై చర్చించారు. వీటన్నింటికి సంబంధించి ఎంపీలకు తగిన సమాచారం అందజేయాలని అధికారులకు సూచించారు.

cbn 18072018 3

ఎల్లుండి అవిశ్వాసం పై చర్చ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఫోకస్‌ కావాలనే దానిపైనే ప్రధానంగా తెలుగుదేశం దృష్టి సారించింది. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏ విధంగా మోసం చేసింది? హోదాతో పాటు, చాట్టంలో పెట్టిన 18 అంశాలను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చోపచర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఉన్న నేతలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాలను లేవనెత్తుతూనే రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందనే అంశాన్ని ఫోకస్‌ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read