ప్రజా రక్షణ చర్యల్లో జాగారం చేసిన సీఎం చంద్రబాబు నిద్రహారాలు మాని శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తుత్లీ తుపాను ప్రమాదం నుంచి ప్రజలను అప్రమత్తత చేయడంలో, క్షేమంగా బయటపడవేసే చర్యల్లో నిద్ర మానుకున్న సీఎం చంద్రబాబు.ఉదయం నుంచి అధికారులతో భేటీలు, అనంతపురము జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం అయి కూడా, తిత్లీ తుపాను పై బుధవారం 12.30 గంటల వరకూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయంగా ప్రత్యక్ష పర్యవేక్షణకు సచివాలయంకు వచ్చి రంగంలోకి దిగారు. సీఎం చంద్రబాబు. తిత్లీ తుపాను ప్రభావం నుంచి ప్రాణ, ఆస్తి నష్టం నివారణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించారు.
"తిత్లీ తుపాను తీరం దాటేటప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుంది అంచనా వేయడమే కాదు..దానిని ప్రభావం ప్రజలపై పడకుండా కాపాడడంలోనే మన సమర్థత ఆధారపడి ఉంటుంది. తిత్లీ తుపాను తీవ్రతను నివారించడం సాధ్యకాకపోయినప్పటికీ నష్ట నివారణను ఎదుర్కోవడంలో అప్రమత్తతతో వ్యవహరించడం ముఖ్యం...తుపాను ప్రభావాన్ని రేపు ఉదయం వరకూ పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం అత్యవసరం " అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలుమార్లు దిశానిర్దేశం చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు ఉత్తరాంధ్ర కలెక్టర్లు, పోలీసులు, విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరుల శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ లు తీసుకున్నారు. 11.30 గంటలకు టెలీకన్ఫరెన్స్ తీసుకున్న ముఖ్యమంత్రి తెల్లవారు ఝాము 4గంటలకు మళ్ళీ టెలీకన్ఫరెన్స్ తీసుకుంటానని తెలిపారు.
"ఆర్టీజీఎస్ కు వచ్చి తుపాను ఎదుర్కోవడంపై పర్యవేక్షణ చేయడానికి సిద్ధపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రద్ధ, నిబద్ధతకు అధికారులు విస్మయం చెందారు. తాము రాత్రంతా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తిత్లీ తుపాను తీవ్రత, తదితర సమాచారం తెలియజెపుతామని అధికారుల సూచనతోను ముఖ్యమంత్రి శాంతించలేదు. అర్థరాత్రి దాటినా ఏ సమయంలోనైనా తిత్లీ తుపాను పై చర్యల కోసం తనను సంప్రదించడంలో అలసత్వం వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఇబ్బందులు పడకుండా దసరా సెలవులు లేకుండా నిర్వహిస్తున్నట్లయితే పాఠశాలలు , కళాశాలలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంగన్ వాడీ పాఠశాలకు సైతం సెలవులు ప్రకటించాలని సూచించారు.