నవనిర్మాణ దీక్ష జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీనితో భయానక వాతావరణం నెలకొనటంతో సభలో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సీఎం చంద్రబాబు వేదికపై ఉన్నచోటే కూర్చున్నారు. ఆయనపై వర్షం పడకుండా సెక్యూరిటీ సిబ్బంది గొడుగులు పట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇచ్చిన వినతిపత్రాలను సెల్ టార్చ్ వెలుగులో పరిశీలించారు.
శృంగవరపుకోటలో సోమవారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణదీక్ష సభకు భారీ వర్షం అంతరాయం కలిగించింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈదురుగాలులకు సభా ప్రాంగణం చిగురుటాకులా వణికింది. రెండువైపులా రేకులు ఎగిరిపోవడంతో అదెక్కడ కూలిపోతుందోనని పలువురు హడలిపోయారు. వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా వర్షం నీరు పడడంతో ఆయన కుర్చీ మారగా భద్రతా సిబ్బంది గొడుగుపట్టాల్సి వచ్చింది. దాదాపు అరగంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సభను ప్రారంభించి ఏకధాటిగా 1.20 గంటల పాటు ప్రసంగించారు.
అయితే కరెంటు పోయిన సందర్భంలో కూడా చంద్రబాబు రెస్ట్ తీసుకోకుండా, సెల్ లోని టార్చ్ లైట్ వేసుకుని, ఆయన వద్దకు వినతి పత్రాలు ఇచ్చే వారిని రమ్మని, సెల్ లైట్ వెలుతురులోనే, అవి చూసి ఆదేశాలు ఇచ్చారు. ఇవి చూసిన ప్రజలు, చంద్రబాబు కమిట్మెంట్ ను మెచ్చుకున్నారు. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా, చంద్రబాబు పని చెయ్యటం చూస్తుంటే, మన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకూడదు అని, దానికి చంద్రబాబే ఆదర్శం అని అన్నారు. ఒక కమిట్మెంట్.. ఒక అడ్మనిస్ట్రేటర్.. ఒక విజన్.. ఒక దిక్సూచి.. వీటికి అర్ధం ఏంటో, ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.