ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా, కేంద్రంలోని మిగతా మంత్రులకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత పది రోజుల్లో, వివిధ సమస్యల పై 10 లేఖలు రాసారు. తాజాగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పై లేఖ రసారు. మెకాన్‌ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారంగా సుప్రీంలో సవరణ అఫిడవిట్‌ను కేంద్రం వెంటనే దాఖలు చేయాలని కోరుతూ సోమవారమే మోడీకి చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖ వివరాలను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సెయిల్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇటీవల సుప్రీంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అనుకూలం కాదంటూ అఫిడవిట్‌ దాఖలు చేసిందని, ఇది ఏపీ ప్రజలకు ఆందోళనను కలిగించిందని, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ ప్రాజెక్టు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఆర్థికంగా దన్నుగా ఉంటుందని, సుప్రీంలో వెంటనే సవరణ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

cbn 21062048 2

చంద్రబాబు పది రోజులుగా కేంద్రానికి విభజన హామీలపై లేఖలు రాస్తున్నారు. వివిధ అంశాలపై ఆయన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖలు రాస్తున్నారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభును కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా కాలుష్య నియంత్రణ మండలి, చత్తీస్‌గఢ్ పర్యావరణ సంరక్షణ బోర్డు ఇచ్చిన పనుల నిలిపివేత ఉత్తర్వులను పూర్తిస్థాయిలో ఉపసంహరించేలా మరో లేఖ రాశారు.

cbn 21062048 3

గ్యాస్ గురించి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు, తిరుమల విషయంలో పురావస్తు శాఖ కార్యాలయం మొదలు అమరావతి సర్కిల్ వరకు జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు, జీడిపప్పు పరిశ్రమ గురించి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుకు, బకాయి వసూళ్లు, విద్యుత్ రంగం ఒత్తిడిపై మరో కేంద్రమంత్రికి, విశాఖలో పౌర విమానాల రాకపోకల సమయాలపై ఆంక్షలు విధించవద్దని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మరి ఈ లేఖల అన్నిటి పై, కేంద్రం స్పందిస్తుందో, పక్కన పదేస్తుందో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read