తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార వైకాపా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అనేక అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి చర్యలు లేవు. స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై అధికార వైకాపా లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడుతోంది. ఫేక్ ఐడీలతో స్థానికంగా లేని వారి ఓట్లను బయట వారితో వేయించి వైసీపీ రిగ్గుంగులకు పాల్పడుతోంది. పేక్ ఓటర్ దారులు తండ్రిపేరు, సహచరి పేర్లు కూడా చెప్పలేపోతున్నారు. వారు ఫేక్ ఓటర్ దారులు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫిడవిట్ ప్రకారం తిరుపతి పార్లమెంటుకు చెందిన వ్యక్తి కాదు. కానీ, ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఆయన తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు. పోలింగ్ రోజైన 17 వ తేదీన 11.15 AM కు పత్రికా సమావేశం నిర్వహించారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్దం. ఇతర మంత్రులు సైతం తిరుపతిలోనే తిష్ట వేశారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకు తెలుగుదేశం నాయకులు ఫేక్ ఓటరుదారులను పట్టుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ చర్యలు శూన్యం. స్థానిక అధికారులు, పోలీసులు ఫేక్ దారులను వదిలేసి తెదేపా నాయకులైన నరసింహ యాదవ్, దొరస్వామీ నాయుడు, శ్రీరాం చినబాబు, దేవనారాయణ రెడ్డి, వెంకటేష్, వెంకటరత్నం, రవి, మణికంఠ లను అరెస్టు చేశారు. పోలింగ్ అక్రమాలకు సంబంధించి వీడియో క్లిప్పింగులతో సహా ఎన్నికల అధికారులకు అందించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలి. తిరుపతి అసెంబ్లీ సెంగ్మెంట్లలో ఎన్నికలను రద్దు చేసి తిరిగి రీ-పోలింగ్ నిర్వహించాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read