తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు చెందిన ఓట్లు ఇష్టా రాజ్యంగా తీసేస్తున్న వైసిపీ ప్రభుత్వం కుట్ర ఢిల్లీ వరకు వెళ్ళటమే కాదు, ఇక్కడ జరిగింది చూసి, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా షాక్ తింది. నేరుగా రంగంలోకి దిగింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ నుంచి అనంతరపురం రానుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు టీడీపీకి చెందిన వారి ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది. దీని పై గ్రౌండ్ లో విచారణ చేయటానికి, ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ వస్తున్నారు. విడపనకల్లు మండలం చీకలగురికిలో టీడీపీ ఓట్ల తొలగింపులో కుట్ర జారిగిందని. ఫోర్జరీ నోటీసుల తయారీ చేసి ఇచ్చారని, దీని పై అధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్లను అడ్డు పెట్టుకుని, ఓట్లు తొలగించారని తెలుగుదేశం ఆరోపణ. ఈ అంశం పై కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వస్తుందని తెలుసుకుని, తమ గుట్టు బయట పడకుండా, కింద స్థాయి ఉద్యోగులు పై వేటు మొదలు పెట్టారు. బీఎల్వోలు గోపి, మధును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏమి చేస్తుందో చూడాలి మరి.
టిడిపి ఓట్లు తొలగింపు పై, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం... నేరుగా ఢిల్లీ నుంచి ఏపికి వచ్చిన ఈసీ..
Advertisements