ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ సంస్థలు టార్గెట్ అవుతున్న విషయం చూస్తున్నాం. ముఖ్యంగా కోర్టులు, ఎన్నికల కమిషన్, శాసనమండలి చైర్మెన్ లాంటి వాళ్ళు కూడా టార్గెట్ అయ్యారు. అయితే ఈ మూడిటిలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని మాత్రం, ప్రభుత్వం విపరీతంగా టార్గెట్ చేసింది. ఆయన ప్రతి చిన్న దానికి కోర్టుకు వెళ్లి, సాధించుకోవాల్సిన పరిస్థితి. చివరకు ఖర్చులు కోసం డబ్బులు ఇవ్వటం లేదని, కోర్టులో పిటీషన్ వేసారు అంటే, ఎన్నికల కమీషనర్ ని ప్రభుత్వం ఎలా టార్గెట్ చేసిందో తెలుస్తుంది. ఇక ఆయన్ను కులం పేరుతో మంత్రులు, ముఖ్యమంత్రి దూషించటం కూడా చూసాం. ఇక మరో పరాకాష్ట ఏమిటి అంటే, ఆయన్ను ఏకంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చి మరీ తప్పించటం. ఇది నిజంగా షాకింగ్ నిర్ణయం అనే చెప్పాలి. ఒక ఎన్నికల కమీషనర్ ని తప్పించాలి అంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. హైకోర్టు జడ్జిని ఎలా తప్పిస్తారో, అలా తప్పించాలి. మన దేశ చరిత్రలో ఎప్పుడూ అలా జరగలేదు. అయితే మన రాష్ట్రంలో ఏదైనా సాద్యం కాబట్టి ఇక్కడ జరిగింది. ఆర్డినెన్స్ తెచ్చి, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డను ప్రభుత్వం తొలగించింది. అయితే ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు, సుప్రీం కోర్టులో పోరాడి, మళ్ళీ పదవిలోకి వచ్చారు. తరువాత కూడా ఆయనకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం అందటం లేదు. ఇవన్నీ చూసో ఏమో కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.

ramesh 16012021 2

కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఎన్నికల అధికారుల పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవటం కుదరదు అని చెప్పింది. ఎన్నికలా అధికారులు పట్ల చర్యలు అంటూ, రాష్ట్రాలు, ఆయా అధికారులను ఇబ్బంది పెట్టటం, సౌకర్యాలు తగ్గించటం, బద్రత కుదించటం, లాంటి చర్యలు చేస్తే సహించం అని తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు సజావుగా జరపటానికి ఎన్నికల అధికారులు ఉన్నారని, ఇలా ఎన్నికల అధికారులను వేధించటం, ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తాయని, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, అధికారుల విధుల పై ఈ ప్రభుత్వం కనిపిస్తుందని పేర్కొంది. ఇలా వేధింపుల పరిస్థితి ఉంటే, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు పని చేయటానికి ముందుకు రారని తేల్చి చెప్పింది. అయితే ఉన్నట్టు ఉండి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇవ్వటం వెనుక, ఏపిలో జరుగుతున్న సంఘటనలు కారణం అయి ఉండవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read