ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిధ్యాసంతా తన సొంత నియోజకవర్గమైన పులివెందులపైనేఉందని, రాష్ట్రప్రగతి, అభివృద్ధిపై ఆయనకు ఎటువంటి ధ్యాసలేదని, వైసీపీ ప్రభుత్వ 22నెలలపాలనే చెబుతోందని టీడీపీ అధికార ప్రతినిది సయ్యద్ రఫీ వెల్లడించారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాడనడానికి, రైల్వే ప్రాజెక్టులపై కేంద్రరైల్వే మంత్రి ఇచ్చిన సమాధానమే నిదర్శనం. వైసీపీప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క రైల్వేప్రాజెక్ట్ కూడా పూర్తికాలేదు. ఉన్నప్రాజెక్టులను పూర్తిచే యడానికి రాష్ట్రప్రభుత్వంవద్ద డబ్బులేదని, ప్రభుత్వం నుంచి తమకు సహకారం లభించడంలేదని కేంద్రమంత్రి చెబుతు న్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అమరావతికి మంజూరైన రైల్వే జంక్షన్ కు తాము నిధులివ్వలేమంటూ జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాయడం దారుణాతిదారుణం. ఎప్పుడో రాష్ట్రానికి మంజూరైన కోటిపల్లి –నర్సాపురం రైల్వే లైన్ కూడా రాష్ట్రానికి అవసరం లేదని ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. ఆ రైల్వేలైన్ నిర్మాణంలో కొంతవరకు పనులు కూడా జరిగాయి. అలాంటి రైల్వేలైన్ అవసరంలేదని, ఆప్రాంతంలోని వారికి సామర్లకోట రైల్వేస్టేషన్ అందుబాటులో ఉందని ఆయన చెప్పడం సిగ్గుచేటు. ఆ విధంగా ముఖమంత్రి లేఖరాయడం ఆయనలోని అవివేకానికి సంకేతం. ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన రైల్వేప్రాజెక్టుల తో పాటు, నిర్మాణంలో ఉన్నవాటికి అవసరమైన నిధులను కేంద్రంనుంచి ఎలా రాబట్టాలనేదానిపై తనపార్టీ ఎంపీలతో ఒక్క రోజు కూడా సమీక్ష నిర్వహించింది లేదు. ఆయన సమీక్ష చేసినట్టు ఎక్కడా ఏనాడూ ప్రసారమాధ్యమాల్లో రాలేదు. ఈనాడు వైసీపీఎంపీలు అడిగే ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలువింటే, జగన్ ప్రభుత్వపనితీరు ప్రజలకు అర్థమవుతోంది. రాష్ట్రప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన నిధులివ్వకుండా, కేంద్రం రైల్వే ప్రాజెక్టులను ఎలా పూర్తిచేస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చెప్పడం జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?

కాకినాడ - పిఠాపురం రైల్వే లైన్ మెయిన్ లైన్. అదికూడా తమకు అవసరం లేదని ముఖ్యమంత్రి లేఖరాశారు. కోనసీమకు, గోదావరి జిల్లాలకు అన్యాయంచేసేలా జగన్ వ్యవహరించారు. చంద్రబాబునాయు డు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోఉన్న రైల్వేలైన్లతో పాటు, కొత్తవాటినికూడా రాష్ట్రానికి సాధించుకున్నారు. రూ. 523కోట్లు ఖర్చుచేసిన కోటిపల్లి – నర్సాపురం రైల్వేలైన్ ముఖ్యమంత్రి వద్దన్నారంటే, ఆప్రాజెక్ట్ కు ఖర్చుపెట్టిన సొమ్మంతా నిరుపయోగమైనట్టేగా? ఆప్రాజెక్టును తెలుగుదే శం హయాంలో ప్రారంభించారని ముఖ్యమంత్రి వద్దన్నారా? కడప-బెంగుళూరు రైల్వేలైన్ కావాలని రాజశేఖర్ రెడ్డే స్వయంగా డిమాండ్ చేశారు. ఆలైన్ ను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. రైల్వేలైన్ వస్తే, ఆమార్గంలోని గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధిచెందుతాయనే ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రికి లేకపోవడం విచారకరం. రవాణా వ్యవస్థలో రై ల్వే లైన్లు అతికీలకమనే విషయం గ్రహించకపోతేఎలా? విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ గురించి పట్టించుకో ని ముఖ్యమంత్రి, మెట్రో కార్యాలయాన్ని మాత్రం విశాఖకు తరలించారు. కృష్ణాకెనాల్ వద్ద రైల్ నీరు ప్రాజెక్ట్ పెడతామని కేంద్రమంత్రి చెప్పిఉన్నారు. దానిగురించి ఈముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదు. రైల్ నీరు ప్రాజెక్ట్ పూర్తైతే రాష్ట్రానికే మంచిదికదా? విభజనచట్టంలో పేర్కొన్న రైల్వేజోన్ సంగతైతే ముఖ్యమంత్రి ఎప్పుడో మర్చిపోయారు. విశాఖపట్నం డివిజన్ లోనే రైల్వేజోన్ఉండేలా జగన్మోహన్ రెడ్డి ఏనాడూ కేంద్రాన్ని ఒత్తిడిచేయలేదు. రైల్వే ట్రాకులకు అనుసంధానం గా రోడ్డుమార్గం, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ఏర్పాటుచేస్తామని కూడా విభజన చట్టంలో చెప్పారు. వాటిగురించి కూడా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదు. విజయవాడ – విశాఖపట్నం మీదుగా కొత్తరైళ్లు నడపాలన్న ఆలోచన కూడా ఈప్రభుత్వంచేయడంలేదు.

ప్రధానమంత్రి తనసొంత రాష్ట్రానికి రైల్వేప్రాజెక్టులనుఎలా కేటాయించుకుంటున్నారో్, బుల్లెట్ ట్రైన్ తోపాటు, మెట్రో ప్రాజెక్టును ఎలా తీసుకెళ్లారో చూస్తూనేఉన్నాము. గుంటూరునుంచి కిసాన్ రైలు నడపాల ని వైసీపీఎంపీ అడిగితే, కేంద్రమంత్రి సాధ్యంకాదన్నారు. కేంద్ర పెద్దలు అలామాట్లాడుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోరా? కొత్తరైల్ల్వేలైన్ల గురించి కేంద్రంపై ఒత్తిడితెచ్చే ధైర్యం ముఖ్య మంత్రికిలేదని ప్రజలకు అర్థమైంది. ఒక్క రైల్వేప్రాజెక్టులే కాదు, మరే విషయంలోనైనా సరే, వైసీపీఎంపీలు కేంద్రంనుం చి రాష్ట్రానికిఏంసాధించారు? తిరుపతికిఉపఎన్నికలో మూడు లక్షల మెజారిటీతో తమపార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని మంత్రిపెద్దిరెడ్డిచెబుతున్నాడు. ఉన్నఎంపీలే రాష్ట్రానికి ఏమీ చేయకుండా కూర్చుంటే, ఆపార్టీకిఇంకోఎంపీఎందుకో మంత్రి చెప్పాలి. ఢిల్లీలో ఎంపీలకుఇచ్చే సౌకర్యాలు అనుభవించడం తప్ప, వైసీపీఎంపీలు ఏంచేస్తున్నారు? రాష్ట్రానికి ఏమీ సాధిం చలేనప్పుడు కొత్తగామరోఎంపీని గెలిపించమని అడిగే అర్హత వైసీపీకిఉందా? రాష్ట్రానికి, ప్రజలకుఏమీచేయని వారికి ఓట్లు అడిగే అర్హత లేనేలేదంటాను. మరోఎంపీ తమపార్టీనుంచి గెలిచాడని చెప్పుకొని చంకలు గుద్దుకోవడంతప్ప, తిరుపతి విజయం వైసీపీకి ఎందుకుపనికొస్తుందో చెప్పాలి. రాష్ట్రానికి చెందినఎంపీలు ఏంచేయాలనే దానిపైముఖ్యమంత్రి సమీక్ష చేయకపోతే ఎలా? ఆయనకు ఆ బాధ్యత లేదా? తమ రాష్ట్రా నికి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకుంటే, వైసీపీఎంపీలంతా రాజీనామాలు చేస్తారనే మాట జగన్ నోటినుంచి ఎందుకు రాదు? ప్రజలుకూడా దీనిపైఆలోచించాలి. రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో, ముఖ్యమంత్రి ఎందుకు వాటిని పట్టించుకో్వడం లేదో ప్రజలు గమనించాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read