"ఒక పరసంటా, అర పరసంటా చెప్తాం కదా.. వెయిటు.. ఎందుకు కంగారు పడతారు. వి విల్ కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ బై డిసెంబర్ 2021" అంటూ అసెంబ్లీ సాక్షిగా రంకెలు వేసిన మంత్రి అనిల్ కుమార్ , మొన్న సోషల్ మీడియాలో హెవీ ట్రోలింగ్ కు గురయ్యారు. దీని పై స్పందించిన మంత్రి, మేము ఏమి చేయం, ఇదంతా చంద్రబాబు కుట్ర అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కు కొత్త డేట్ ఇచ్చింది. అదే ఏప్రిల్ 2022. అయితే ఈ రోజు కేంద్రం పోలవరం విషయంలో అసలు విషయం చెప్పేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పోలవరం పై ఒక స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేయటం అసాధ్యం అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2022 ఏప్రిల్ లోపు పోలవరం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా కూడా, అనేక అడ్డంకులు వల్ల, పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరుగుతందని కేంద్రం చెప్పింది. అలాగే ఈ పోలవరం పనులు ఎంత వరుకు జరిగాయి, ఏ పని ఎంత వరకు వచ్చిందో కూడా, కేంద్రం వివరణ ఇచ్చింది. కేంద్ర జల శక్తి సహాయ మంత్రి ఈ వివరాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు, కేంద్ర జల శక్తి సహాయ మంత్రి, ఈ వివరణ ఇచ్చారు.
కేంద్ర మంత్రి సమాధానం బట్టి, ఒక ప్రణాళిక ప్రకారం అయితే, పనులు జరగటం లేదు అనేది స్పష్టం అవుతుంది. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి అవ్వటం అసాధ్యం అని చెప్తూనే, ఆ తరువాత ఎప్పటికి ఈ పనులు పూర్తవుతాయి అనే విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఇక ఈ పనుల్లో జాప్యం జరగటానికి కారణం, పునరావాసం, పరిహారం పనుల్లో కూడా చాలా జాప్యం జరుగుతుందని, అది కూడా ఒక కారణం అంటూ , కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. స్పిల్ వే చానెల్ పనులు 88 శాతం పూర్తయితే, అప్రోచ్ ఛానెల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం అయ్యాయని, పైలట్ చానెల్ పనులు అయితే కేవలం 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. మరో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, కేలవం పోలవరం నీటి ప్రాజెక్ట్ కు మాత్రమే తాము నిధులు కేటాయించినట్టుగా చెప్పారు. కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు మాత్రమే ఇస్తాం అని చెప్తూ, 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి కాదని తేల్చి చెప్పారు.