సిఆర్డీఏ రద్దుతో పాటుగా, వికేంద్రీకరణ బిల్లులకు ప్రభుత్వం గజెట్ విడుదల చెయ్యటంతో, ఈ రెండు బిల్లుల పై రాజధాని ప్రాంత రైతులు, హైకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, హైకోర్టు ఈ నెల 27 వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇస్తూ, కౌంటర్లు దాఖలు చెయ్యాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు ప్రకారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరుపున లలిత హిడావో ఈ అఫిడవిట్ దాఖలు చేసారు. అఫిడవిట్ లో తమకు రాష్ట్రాలు రాజధానుల నిర్ణయం పై సంబంధం లేదని చెప్పారు. రాష్ట్ర రాజధానుల నిర్ణయం అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అని అన్నారు. ఈ బిల్ ప్రవేశపెట్టె సమయంలో తమను రాష్ట్ర ప్రభుత్వం ఏమి సంప్రదించలేదని అన్నారు. అయితే ఇదే సందర్భంగా మాకు రాజధాని విషయంలో సంబంధం లేదు అంటూనే, ఈ అంశం పై చట్ట ప్రకారం, ఏది న్యాయమో ఆ నిర్ణయం తీసుకోవాలి అంటూ, హైకోర్టుని అభ్యర్ధించారు.

అయితే ఒక పక్క తమకు సంబంధం లేదు అంటూనే, చట్ట ప్రకారం ఏమి కరెక్ట్ అయితే ఆ నిర్ణయం తీసుకోమనటం కొస మెరపు. అమరావతి రాజధాని అనేది, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో "ఏ కాపిటల్" అని ఉంది కానీ, త్రీ క్యాపిటల్స్ అనేది లేదు. మరి ఇది కచ్చితంగా న్యాయ సమీక్షకు వస్తుంది కదా ? చట్ట పరిధిలో అంశమే కదా ? మరి ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో పక్క ఇప్పటికే అమరావతిలో కేంద్రం 2500 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు మూడు రాజధానులు అంటే, అమరావతిలో కేవలం అసెంబ్లీ సమావేశాలు అంటే, ఆ 2500 కోట్లు బూడిదలో పోసినట్టే కదా ? దీనికి ఎవరు సమాధానం చెప్తారు ? మాకు సంబంధం లేదు అని తప్పించుకోలేరుగా ? ఇది కూడా కచ్చితంగా న్యాయ సమీక్షకు వస్తుంది. ఈ అంశాలు అన్నీ వస్తాయి కాబట్టే కేంద్రం తెలివిగా రాజధాని నిర్ణయం మాకు సంబంధం లేదని, కానీ చట్టపరంగా ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి అంటూ, తన అఫిడవిట్ లో చెప్పింది. మరి 27వ తేదీన కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read