ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే, ఎవరైనా అమరావతి అనే చెప్తారు. కేంద్రం ఇచ్చే లేఖల్లో కానీ, అధికారిక ఉత్తరాల్లో కానీ, అమరావతి అనే ఉంటుంది. ఎందుకు అంటే, కేంద్రం అమరావతి రాజధానిగా గెజెట్ ఇచ్చింది కాబట్టి, అమరావాతే రాజధాని. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత అమరావతిని మూడు ముక్కలు చేసినా, ఏ ముక్క రాజధాని అనేది చెప్పటానికి లేదు. అదీ కాక ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది, కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. అంటే ఇప్పటికీ అమరావాతే రాజధాని. అయితే కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో, ప్రతి సారి ఈ విషయం పై కన్ఫ్యూషన్ వస్తుంది. మొదటగా సర్వే అఫ్ ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా చూపించ లేదు. దీంతో టిడిపి ఎంపీ గల్లా పోరాడి, కేంద్రం చేత మళ్ళీ అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ తెప్పించారు. తరువాత మొన్నీ మధ్య ఒక ఆర్టిఐ రిప్లై లో, ఏపికి మూడు రాజధానులు అంటూ కేంద్ర హోం శాఖ చెప్పింది. దీని పై పెద్ద ఎత్తున పోరాటం చేయటంతో, మళ్ళీ ఇంకో ఆర్టిఐ రిప్లై ఇస్తూ, అమరావతి రాజధాని అని, ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం అని చెప్పంది. ఇప్పుడు తాజాగా పార్లమెంట్ వేదికగా, పెట్రోల్, డీజిల్ రెట్ల పై ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ దగ్గర, అమరావతి బదులు విశాఖ రాజధాని అంటూ పెట్టటంతో, పెద్ద వివాదం రేగింది.
ఇంకేముంది, అమరావతి రాజధాని కాదు, విశాఖ రాజధాని అంటూ కేంద్రం గుర్తించింది అంటూ వైసీపీ సోషల్ మీడియా, కొన్ని బ్లూ చానల్స్ చేయని హడావిడి లేదు. అయినా వైసీపీ లాజిక్ ప్రకారం మూడు రాజధానులు గుర్తించాలి కానీ, ఇలా ఒక రాజధాని ఏమిటో అర్ధం కాలేదు. అయినా వీళ్ళ హడావిడి, పాపం మూడు గంటలు కూడా మిగల లేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, ఆదివారం అయినా సరే, రాత్రి పది గంటల ప్రాతంలో కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. విశాఖ ఏపి రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని చెప్పింది. ఆయా రాష్ట్రాల రాజధానులు లేదా, ప్రముఖ నగరాల్లో పెట్రోల్ రేట్లు చెప్పే ఉద్దేశంలోనే, ఏపిలో ప్రముఖ నగరంగా ఉన్న విశాఖలో పెట్రోల్ రేట్లు గురించి చెప్పమని, ఇది హెడ్డింగ్ పొరపాటు మాత్రమే అని, ఇప్పుడు క్యాపిటల్ అని కాకుండా, నగరం అని సవరించి పెడతామని చెప్పింది. ఇదే విషయాన్ని లోక సభకు కూడా తెలియ చేస్తామని చెప్పింది. దీంతో వైసీపీకి, బులుగు మీడియాకి లేట్ నైట్ షాక్ తగిలింది.